-
ఆగష్టు 18 లోపు సునితా విలియమ్స్ ను తీసుకురాకపోతే?
-
స్టార్ లైనర్ స్పేస్ షిప్ మరమ్మత్తులపై నాసా ఆందోళన
అంతర్జాతీయ అంతరిక్ష కేంద్ర నుంచి భారత సంతతి వ్యామగామి సునీతా విలియమ్స్ సురక్షితంగా భూమిపైకి వస్తారా అన్న ఆందోళన సర్వత్రా వ్యక్తం అవుతోంది. అమెరికాకు చెందిన నాసా.. సునీతా విలియమ్స్, బుచ్ విల్మోర్ వ్యోమగాములను పది రోజుల మిషన్ లో భాగంగా అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రానికి పంపించింది. సరిగ్గా రెండు నెల క్రితం జూన్ 5న భూకక్ష్యకు 400 కిలోమీటర్లు దూరంలో ఉన్న ఇంటర్నేషనల్ స్పేస్ స్టేషన్ కు బోయింగ్ స్టార్ లైనర్ వ్యోమనౌక వారిని సక్సెస్ ఫుల్ గా మోసుకెళ్లింది.
ఇంతవరకు బాగానే ఉన్నా.. సునీతా విలియమ్స్, బుచ్ విల్మోర్ వ్యోమగాములు పది రోజుల తరువాత జూన్ 14 భూమికి తిరిగి రావాల్సి ఉండగా.. స్టార్ లైనర్ వ్యోమనౌకలో సాంకేతిక సమస్యల కారణంగా వారి ప్రయాణం వాయిదా పడుతూ వస్తోంది. ప్రధానంగా స్టార్ లైనర్ లో హీలియం లీకేజీ కారణంగా సాంకేతిక సమస్యలు నెలకొన్నాయి. వ్యామనౌకలో ఉన్న మొత్తం 28 థ్రస్టర్లకు గాను 5 పనిచేయడం మానేశాయి. అంతే కాకుండా స్పేస్ క్రాఫ్ట్లోని సర్వీస్ మోడ్యుల్లో 5 చోట్ల హీలియం గ్యాస్ లీక్ అవుతున్నట్లు గుర్తించారు.
ఈ సాంకేతిక సమస్యల కారణంగా సునీతా విలియ్మస్ బృందం భూమికి తిరిగి రావడం సాధ్యం కావడం లేదు. స్పేస్ స్టేషన్ నుంచి వారి ల్యాండింగ్ ప్రక్రియ ఎప్పటికప్పుడు పడుతూ వస్తోంది. సునీతా విలియమ్స్, బుచ్ విల్మోర్ వ్యోమగాములను అంతరిక్ష కేంద్రం నుంచి భూమిపైకి తీసుకొచ్చేందుకు నాసా ప్రయత్నిస్తోంది. నాసా సైంటిస్టులు భూమి మీద నుంచే స్పేస్ స్టేషన్ లో ఉన్న బోయింగ్ స్టార్ లైనర్ వ్యామగౌకకు గత 50 రోజులుగా మరమ్మతులు చేస్తున్నా ఫలితం మాత్రం లేదు. దీంతో సునీతా విలియమ్స్, బుచ్ విల్మోర్లు సేఫ్ గా భూమిపైకి వస్తారా అన్న ఆందోళన సర్వత్రా నెలకొంది.
ఈ క్రమంలో ఓ ఆసక్తికరమైన అంశం నాసాను కలవరపెడుతోంది. బోయింగ్ స్టార్ లైనర్ వ్యామనౌకలో నెలకొన్న సాంకేతిక సమస్యలను సరిచేసి.. సునీత విలియమ్స్, బుచ్ విల్మోర్ లను భూమి పైకి తీసుకుని వచ్చేందుకు నాసాకు కేవలం ఆగష్టు 18 వరకు మాత్రమే గడువు మిగిలి ఉందన్న చర్చ జరుగుతోంది. ఎందుకంటే మరో స్పేస్ మిషన్ క్రూ-9 మిషన్ ఆగస్టు 18 కంటే ముందుగానే ప్రయోగించడానికి షెడ్యూల్ సిద్ధమైంది. ఈ క్రూ-9 మిషన్ నలుగురు వ్యామగాములను అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రానికి తీసుకెళ్ళనుంది. అంటే వాళ్లు వెళ్లే లోపలే స్పేస్ స్టేషన్ కు అనుసంధానమై ఉన్న స్టార్ లైనర్ స్పేష్ షిప్ను అన్డాక్ చేయాల్సి ఉంటుంది.
దీంతో అంత లోపు స్టార్ లైనర్ రిపేర్ పూర్తై.. సునితా, విల్మోర్ లను భూమిపైకి తీసుకురాగలమా అన్న టెన్షన్ మొదలైంది నాసా సైంటిస్తులకు. ఒకవేల గడువు లోపు స్టార్ లైనర్ వ్యామనౌక మరమ్మత్తులు పూర్తి కాకపోతే ప్రత్యమ్నాయ మార్గాలను అన్వేషిస్తోంది నాసా. ఇందులో భాగంగా ఎలాన్ మస్క్ కు చెందిన స్పేస్ ఎక్స్ డ్రాగన్ క్యాప్సూల్ ను అంతరిక్షంలోకి పంపించే అవకాశాలను, సాధ్యాసాధ్యాలను పరిశీలిస్తున్నట్లు తెలుస్తోంది.