-
ఆగష్టు15 లోపు 2 లక్షల రుణమాఫీ అనుమానమేనా?
-
విదేశాల నుంచివచ్చాకే 2లక్షల రుణమాఫీ-సీఎం రేవంత్
తెలంగాణలోరెండు లక్షల రూపాయల రైతు రుణమాఫీ మరికొంత ఆలస్యం అయ్యేలా కనిపిస్తోంది. ఆగస్టు15లోపు రైతులకు 2 లక్షల రుణమాఫీని పూర్తి చేస్తామని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి లోక్ సభ ఎన్నికల సందర్బంగా హామీఇచ్చారు. ఆ మేరకు మొత్తం మూడు విడతల్లో రైతు రుణమాఫీ చేసేందుకు రాష్ట్ర ప్రభుత్వం ప్రణాళికలుసిద్దం చేయగా.. జులై18వ తేదీని మొదటి విడతగా లక్ష రూపాయల లోపు రుణాలు ఉన్న రైతుల ఖాతాల్లోకి డబ్బులు జమ చేసింది వ్యవసాయ శాఖ. ఇక లక్ష నుంచి లక్షా యాభై వేల రూపాయల వరకు బ్యాంక్ లోన్ ఉన్న రైతులతో పాటు, 2 లక్షల వరకు రుణాలు ఉన్న రైతులు తమ వంతు ఎప్పుడు వస్తుందా అనిఎదురుచూస్తున్నారు.
ఇటువంటి సమయంలోమిగతా రెండు విడత రైతు రుణమాఫీపై సీఎం రేవంత్ రెడ్డి క్లారిటీ ఇచ్చారు. నాగర్ కర్నూల్జిల్లా కల్వకుర్తిలో దివంగతకేంద్ర మంత్రి, కాంగ్రెస్ నేతఎస్ జైపాల్ రెడ్డి వర్ధంతి సందర్భంగా నిర్వహించిన బహిరంగ సభలో పాల్గొన్న ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి రైతు రుణమాఫీపై స్పష్టత ఇచ్చారు. రెండో విడత రైతు రుణమాఫీ కింద జూలై 31 లోపు లక్షన్నర వరకు రుణమాఫీ పూర్తి చేస్తామని చెప్పారు. ఆగస్టు 2 నుంచి 14 వరకు తాను విదేశీ పర్యటలో భాగంగాఅమెరికా వెళ్తున్నానని చెప్పిన ముఖ్యమంత్రి అక్కడి నుంచితిరిగి వచ్చిన తర్వాతే 2 లక్షల రుణమాఫీ చేస్తామని ప్రకటించారు.
దీంతో రెండోవిడతలో రుణమాఫీ కానున్న లక్షన్నర రూపాయల వరకు బ్యాంక్లోన్స్ ఉన్న రైతులుఆనందం వ్యక్తం చేస్తుండగా, మరోవైపు 2 లక్షల రుణాలున్న రైతులు ఆందోళన చెందుతున్నారు. ఆగష్టు 15 తేదీలోపు 2 లక్షల రూపాయలరుణాలన్నీ మాఫీ అవుతాయని ఎదురుచూస్తున్న రైతులు.. సీఎం రేవంత్ రెడ్డి ఆగష్టు 14న విదేశాలనుంచి తిరిగి వచ్చిన తరువాతే చర్యలు చేపడతామని చెప్పడంతో అది ఎప్పటికి అవునోనని సందేహిస్తున్నారు.రాష్ట్ర ప్రభుత్వం దగ్గర నిధులు లేకపోవడంతోనే రుణమాఫీ విషయంలో ఇలా అలస్యం చేస్తోందన్నవాదన వినిపిస్తోంది.