ప్రముఖ ఎంటర్‌టైన్మెంట్ పోర్టల్ ఇంటర్నెట్ మూవీ డేటా బేస్ ప్రతి సంవత్సరం దేశంలోని సినిమాల క్రేజ్ గురించి సర్వే నిర్వహించి.. మోస్ట్ పాపులర్ విభాగంలో టాప్ పొజిషన్‌లో ఉన్న సినిమాల జాబితాలను విడుదల చేస్తుందన్న విషయం తెలిసిందే. తాజాగా ఈ ఏడాది మోస్ట్ పాపులర్‌గా నిలిచిన సినిమాల జాబితాను ఐఎండీబీ విడుదల చేసింది. ఈ జాబితాలో ప్రభాస్ నటించిన కల్కి 2898 ఏడీ చిత్రం అగ్ర స్థానంలో ఉండగా.. బాలీవుడ్ బ్లాక్ బస్టర్ అందుకున్న ‘స్త్రీ 2’ రెండో స్థానంలో నిలిచింది. ఇక టాప్ టెన్‌లో ఉన్న సినిమాల జాబితా కూడా విడుదల చేసింది.
కల్కి 2898 ఏడీ
ప్రభాస్ కథానాయకుడిగా నాగ్ అశ్విన్ దర్శకత్వంలో వచ్చిన బ్లాక్ బస్టర్ ‘కల్కి 2898 ఏడీ’. ది గ్రేట్ లెజెండ్స్ అమితాబ్ బచ్చన్, కమల్ హాసన్, హీరోయిన్ దీపిక పదుకొనే వంటి గొప్ప యాక్టర్స్ నటించిన ఈ చిత్రం జూన్ 27 న ప్రపంచవ్యాప్తంగా విడుదలై బ్లాక్ బస్టర్ అందుకొవడమే కాకుండా.. రూ.1300 కోట్ల వసూళ్లను రాబట్టింది. ఈ చిత్రం 2024 ఐఎండీబీ మోస్ట్ పాపులర్ సినిమా విభాగంలో టాప్ పోజిషన్‌లో నిలిచింది.
‘స్త్రీ 2’
కల్కి చిత్రం తర్వాత ఈ ఏడాది మోస్ట్ పాపులర్‌గా నిలిచిన చిత్రం ‘స్త్రీ 2’. బాలీవుడ్ నటులు రాజ్ కుమార్ రావు, శ్రద్దా కపూర్, పంకజ్ త్రిపాఠీ ప్రధాన పాత్రలో వచ్చిన ఈ సినిమాకు అమర్ కౌశిక్ దర్శకత్వం వహించాడు. ఐదేళ్ల కిందట బాలీవుడ్‌లో వచ్చిన ‘స్త్రీ’ సినిమాకు ఈ చిత్రం సీక్వెల్‌గా వచ్చింది. ఇండిపెండెన్స్ కానుకగా ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ చిత్రం బాక్సాఫీస్ వద్ద రూ.880 కోట్ల వసుళ్లను రాబట్టింది. అయితే ఈ చిత్రం 2024 ఐఎండీబీ మోస్ట్ పాపులర్ సినిమా విభాగంలో రెండో స్థానంలో నిలిచింది.
మహారాజ
తమిళ నటుడు విజయ్ సేతుపతి ప్రధాన పాత్రలో వచ్చిన చిత్రం మహారాజ. నితిలన్ సామినాథన్ దర్శకత్వం వహించాడు. జూన్ 14న ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ చిత్రం రూ.150 కోట్లకు పైగా వసూళ్లను రాబట్టింది. అయితే ఈ సినిమా కూడా ఈ ఏడాది మోస్ట్ పాపులర్ సినిమా రేస్‌లో నిలిచింది. ఈ చిత్రం 2024 ఐఎండీబీ మోస్ట్ పాపులర్ సినిమా విభాగంలో మూడో స్థానంలో నిలిచింది.
షైతాన్
బాలీవుడ్ నటుడు అజయ్ దేవగన్, కోలీవుడ్ నటులు ఆర్ మాధవన్, జ్యోతిక ప్రధాన పాత్రల్లో నటించిన తాజా చిత్రం ‘షైతాన్. ఈ సినిమాకు క్వీన్, సూపర్ 30, గుడ్ బై లాంటి చిత్రాలను తీసిన వికాస్ బెహల్ దర్శకత్వం వహించాడు. చేతబడి(బ్లాక్ మ్యాజిక్) కాన్సెప్ట్‌తో మార్చి 08న ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ చిత్రం మంచి విజయాన్ని అందుకుంది. అయితే ఈ చిత్రం కూడా ఈ ఏడాది మోస్ట్ పాపులర్ చిత్రంగా నిలిచింది. 2024 ఐఎండీబీ మోస్ట్ పాపులర్ సినిమా విభాగంలో షైతాన్ నాలుగో స్థానంలో నిలిచింది.
ఫైటర్
బాలీవుడ్ స్టార్ హీరో హృతిక్ రోషన్ నటించిన తాజా చిత్రం ఫైటర్ . సిద్దార్థ్ ఆనంద్ దర్శకత్వంలో వచ్చిన ఈ చిత్రంలో దీపికా పదుకొనే కథనాయికగా నటించగా.. అనిల్ కపూర్ కీలక పాత్రల్లో నటించారు. ఈ చిత్రం రిపబ్లిక్ డే కానుకగా జనవరి 25నప్రేక్షకుల ముందుకు వచ్చి డిజాస్టర్‌గా నిలిచింది. అయితే ఈ సినిమా పరాజయం అందుకున్న కూడా పాపులర్ విభాగంలో సత్త చాటింది. ఈ చిత్రం 2024 ఐఎండీబీ మోస్ట్ పాపులర్ సినిమా విభాగంలో ఐదో స్థానంలో నిలిచింది.
మంజుమ్మెల్ బాయ్స్
మలయాళం నుంచి వచ్చి బ్లాక్ బస్టర్ అందుకున్న చిత్రం ‘మంజుమ్మెల్ బాయ్స్’. సర్వైవర్ థ్రిల్లర్‌గా వచ్చిన ఈ మూవీ ఫిబ్రవరి 22న విడుదలై ఒక్క మలయాళంలోనే రూ.200 కోట్లకు పైగా వసూళ్లను రాబట్టింది. ఇక ఇదే సినిమాను తెలుగులో ఏప్రిల్ 05న విడుదల చేయగా ఇక్కడ కూడా మంచి కలెక్షన్లు రాబట్టింది. అయితే ఈ చిత్రం 2024 ఐఎండీబీ మోస్ట్ పాపులర్ సినిమా విభాగంలో ఆరో స్థానంలో నిలిచింది.
భూల్ భులయ్యా 3
భూల్ భులయ్యా 3, కార్తీక్ ఆర్యన్ నటించిన హారర్ కామెడీ సీక్వెల్, బీటౌన్ ప్రేక్షకుల నుండి మంచి స్పందనను పొందింది. ఇందులో విద్యాబాలన్,మాధురీ దీక్షిత్, త్రిప్తి డిమ్రీ కీలక పాత్రల్లో నటించారు. ఈ చిత్రం 2024 ఐఎండీబీ మోస్ట్ పాపులర్ సినిమా విభాగంలో ఏడో స్థానంలో నిలిచింది.
కిల్
బాలీవుడ్‌లో చిన్న సినిమాగా విడుదలై సూపర్ హిట్ అందుకున్న చిత్రం కిల్. బాలీవుడ్ యువ నటులు లక్ష్ లాల్వానీ తాన్య మనక్తిలా, రాఘవ్ జుయల్ ప్రధాన పాత్రల్లో నటించగా.. సీనియర్ నటుడు ఆశిష్ విద్యార్థి కీలక పాత్రలో నటించాడు. ఈ సినిమాకు నిఖిల్ నగేశ్ భట్ దర్శకత్వం వహించగా.. ధర్మా ప్రొడక్షన్స్ సంస్థ నిర్మించింది. యాక్షన్ థ్రిల్లర్‌గా వచ్చిన ఈ చిత్రం జులై 5న విడుదలై బాక్సాఫీస్ వద్ద సూపర్ హిట్‌గా నిలవడమే కాకుండా విమర్శకుల ప్రశంసలు అందుకుంది. ఈ చిత్రం 2024 ఐఎండీబీ మోస్ట్ పాపులర్ సినిమా విభాగంలో ఎనిమిదో స్థానంలో నిలిచింది.
సింగం ఎగైన్
అజయ్ దేవగణ్, కరీనా కపూర్ ప్రధాన పాత్రల్లో వచ్చిన చిత్రం సింగం ఎగైన్. రోహిత్ శెట్టి దర్శకత్వం వహించాడు. దీపావళి కానుకగా ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ చిత్రం మంచి విజయాన్ని అందుకుంది. అయితే సినిమా కూడా ఈ ఏడాది పాపులర్ లిస్ట్‌లో చోటు సంపాదించింది. 2024 ఐఎండీబీ మోస్ట్ పాపులర్ సినిమా విభాగంలో 9వ స్థానంలో నిలిచింది.
‘లాపతా లేడీస్’
బాలీవుడ్ మిస్టర్ ఫర్‌ఫెక్షనిస్ట్ అమీర్ ఖాన్ ప్రోడక్షన్‌లో వచ్చిన చిత్రం ‘లాపతా లేడీస్’. అమీర్ ఖాన్ మాజీ భార్య కిరణ్ రావ్ ఈ సినిమాకు దర్శకత్వం వహించింది. జమ్ంతారా వెబ్‌సిరీస్ ఫేమ్ స్పర్శ్ శ్రీవాస్తవ్ ఈ మూవీలో హీరోగా నటించగా.. భోజ్‌పురి నటుడు రవి కిషన్ కీలక పాత్రలో మెరిశాడు. ఈ సినిమా మార్చి 1న ప్రేక్షకుల ముందుకు వచ్చి బాక్సాఫీస్ వద్ద మంచి విజయాన్ని అందుకోవడమే కాకుండా విమర్శకుల ప్రశంసలు అందుకుంది. అయితే ఈ సినిమా కూడా ఈ ఏడాది మోస్ట్ పాపులర్ జాబితాలో చోటు సంపాదించుకుంది. 2024 ఐఎండీబీ మోస్ట్ పాపులర్ సినిమా విభాగంలో ‘లాపతా లేడీస్’ పదో స్థానంలో నిలిచింది.