ఐపీఎల్ చరిత్రలోనే అత్యంత ఖరీదైన ఆటగాడిగా నిలిచాడు మిచెల్ స్టార్క్. అతని కోసం కోల్‌కతా నైట్ రైడర్స్ రూ.24.75 కోట్లు వెచ్చించింది. ఐపీఎల్ చరిత్రలోనే అత్యంత ఖరీదైన ఆటగాడిగా నిలిచాడీ ఆస్ట్రేలియన్ ఆల్ రౌండర్. అతను చివరి సారిగా 2015లో ఐపీఎల్ లో పాల్గొన్నాడు. ఆతర్వాతి స్థానంలో నిలిచాడు ప్యాట్ కమిన్స్. అతన్ని హైదరాబాద్ సన్‌రైజర్స్ 20.50 కోట్లు పెట్టి తీసుకుంది. గతేడాది సామ్ కరెన్ మీద పీబీకేఎస్ జట్టు 18.50 కోట్లు పెట్టగా.. ముంబై ఇండియన్స్ కామెరూన్ గ్రీన్ కోసం రూ.17.50 కోట్లు ఖర్చు చేసింది. సీఎస్‌కే బెన్ స్టోక్స్ కోసం పదహారున్నర కోట్లు వెచ్చించింది. భారత స్కిప్పర్ రోహిత్‌శర్మను తీసుకునేందుకు ఢిల్లీ క్యాపిటల్స్ ప్రయత్నించగా.. ముంబై ఇండియన్స్ అందుకు నిరాకరించింది. మొత్తానికి, 2024 ఐపీఎల్ ఎలాంటి సెన్సేషన్ క్రియేట్ చేస్తుందేమోనని క్రికెట్ అభిమానులు ఆత్రుతగా ఎదురు చూస్తున్నారు.