Monday, April 7, 2025

20 లక్షల కోట్లు ఆవిరి

ట్రంప్‌ టూరిఫ్‌ ఎఫెక్ట్స్‌

ట్రంప్ టారిఫ్ ల ఎఫెక్ట్ స్టాక్ మార్కెట్లను కుదిపేస్తుంది. ప్రపంచ దేశాల సూచీలన్ని నష్టాల బాటలోనే కొనసాగాయి. దీంతో 1987నాటి బ్లాక్ మండే భయాందోళనలు వ్యక్తమయ్యాయి. అసియా, ఐరోపా, అస్ట్రేలియా సహా ప్రపంచ మార్కెట్లన్ని కూడా 3నుంచి 10శాతం నష్టాలు చవిచూశాయి. గతంలో బ్లాక్ మండే వ్యవహారంలో ప్రపంచ సూచీలు 20శాతంకు పైగా నష్టాలపోయాయి. దీంతో ఆ రోజును బ్లాక్ మండేగా అభివర్ణించారు. దేశీయ స్టాక్ మార్కెట్లు అమెరికా అధ్యక్షుడిగా ట్రంప్ ఎన్నికైన నాటి నుంచి బ్లీడ్ అవుతూనే ఉన్నాయి. అయితే గతవారం ఆయన ప్రపంచ దేశాలపై ప్రకటించిన వాణిజ్య పన్నులు ప్రస్తుతం గ్లోబల్ మార్కెట్లను అల్లకల్లోలం చేస్తున్నాయి. ప్రతికూల గ్లోబల్ మార్కెట్ సెంటిమెంట్లతో దేశీయ పెట్టుబడిదారులు కూడా అమ్మకాల బాట పడుతున్నారు. దీంతో నేడు మార్కెట్లు ప్రారంభమైన నిమిషాల వ్యవధిలోనే భారతీయ స్టాక్ మార్కెట్ పెట్టుబడిదారులు ఏకంగా రూ.20 లక్షల కోట్ల సంపదను కోల్పోయారు.
సోమవారం దేశీయ స్టాక్ మార్కెట్లు భారీ నష్టాలతో ప్రారంభమయ్యాయి. సెన్సెక్స్ 3000+ పాయింట్స్ కు పడిపోయి 72,431వద్ధ ట్రేడవుతోండగా..నిఫ్టీ 920పాయింట్ల నష్టంతో 21,984వద్ధ కొనసాగుతోంది. నిఫ్టీలో నమోదిత కంపెనీల మార్కెట్ విలువ ఏకంగా రూ.20లక్షల మేరకు ఆవిరైంది. డాలర్ తో పోలిస్తే రూపాయి మారక విలువ 19పైసలు తగ్గి 85.63 వద్ధ కొనసాగుతోంది. మరోవైపు.. ట్రంప్ ప్రకటించిన సుంకాలతో ఆస్ట్రేలియా, జపాన్, చైనా, సింగపూర్, మలేషియా, తైవాన్ దేశాల స్టాక్ మార్కెట్లకు భారీ నష్టాలు కొనసాగాయి. సోనీ కంపనీ షేర్లు 10 శాతం పతనమైనమయ్యాయి. దీంతో సుంకాల తగ్గింపుపై అగ్రరాజ్యంతో పలు ప్రపంచ దేశాలు చర్చలకు సిద్ధమయ్యాయి.
అమెరికాకు 47వ అధ్యక్షుడిగా డొనాల్డ్ ట్రంప్ జనవరి 20, 2025లో ప్రమాణ స్వీకారం చేపట్టిన నాటి నుంచి భారతీయ స్టాక్ మార్కెట్లలో పెట్టుబడిదారుల సంపద విలువ ఏకంగా రూ.50 లక్షల కోట్ల వరకు ఆవిరైంది. ప్రధానంగా ట్రంప్ తీసుకున్న కఠిన టారిఫ్స్ మాత్రం ప్రపంచ దేశాలను ఉక్కిరిబిక్కిరి చేస్తున్నాయి. దీనిని చాలా మంది ఆర్థిక అణుబాంబుగా పేర్కొంటున్నారు. అయితే ట్రంప్ మాత్రం ప్రపంచ దేశాలు తమ తీరు మార్చుకోకపోతే యూఎస్ మరిన్ని టారిఫ్స్ ప్రకటించాల్సి ఉంటుందని పేర్కొంది. ఈ క్రమంలో చైనా లాంటి దేశాలు ప్రతీకాల సుంకాలను ప్రకటించినప్పటికీ ఇన్వెస్టర్లలో భయాలు కొనసాగుతూనే ఉన్నాయి.
అందుబాటులో ఉన్న సమాచారం ప్రకారం దాదాపు 50కి పైగా దేశాలు సుంకాల విషయంపై అమెరికాతో చర్చలు ప్రారంభించినట్లు వెల్లడైంది. కొందరు ఇవి అమెరికా ప్రజల జీవితాన్ని దుర్భరంగా మార్చేస్తాయని చెబుతున్నప్పటికీ.. మరికొందరు మాత్రం ఆర్థిక మాంద్యాన్ని ప్రేరేపించే అవకాశం ఉందని అంటున్నారు. కేవలం ఇవాళ ఒక్కరోజే భారతీయ పెట్టుబడిదారుల సంపద ఏకంగా రూ.20 లక్షల కోట్ల మేర ఆవిరి కావటం పెద్ద దెబ్బగా చెప్పుకోవచ్చు.

విశ్లేషకుల మాట ఏంటి..?
ట్రంప్ టారిఫ్స్ చర్యల కారణంగా ప్రపంచ మార్కెట్లలో అస్థిరత కొనసాగుతోంది. అయితే ఈ పరిస్థితులు ఎలా అభివృద్ధి చెందుతాయనే అంశం ఎవరికీ తెలియదు. ఇలాంటి మార్కెట్లలో ట్రేడింగ్ చేయటం సరైనదేనా అంటూ చాలా మంది అడిగే ప్రశ్నలకు ప్రముఖ బ్రోకరేజ్ సంస్థ జియోజిత్ ఫైనాన్షియల్ సర్వీసెస్ చీఫ్ ఇన్వెస్ట్‌మెంట్ స్ట్రాటజిస్ట్ వి.కె. విజయకుమార్ బదులిచ్చే ప్రయత్నం చేశారు. ప్రస్తుత తరుణంలో ఇన్వెస్టర్లు వెయిట్ అండ్ వాచ్ ధోరణిని ప్రదర్శించటం ఉత్తమమని అన్నారు. భారత జీడీపీలో ఎగుమతులు కేవలం 2 శాతంగా ఉన్నందున దేశం సాపేక్షంగా మెరుగైన స్థితిలో ఉందని ఆయన అన్నారు. ఆర్థిక వృద్ధిపై ప్రభావం భారీగా ఉండకపోవచ్చని తన అంచనాలను పంచుకున్నారు.
ఇక్కడ ఒక శుభవార్త ఏమిటంటే ఇండియా ఇప్పటికే అమెరికాతో వాణిజ్య ఒప్పందానికి సంబంధించి చర్చలు జరపటమే. మోదీతో ట్రంప్ కి ఉన్న స్నేహం వల్ల చర్చలు ఫలవంతంగా మారే అవశాలు ఎక్కువగా ఉన్నాయని నిపుణులు చెబుతున్నారు. అదే జరిగితే త్వరలోనే అమెరికా టారిఫ్స్ ప్రభావం ఇండియాపై తగ్గవచ్చని అంచనాలు ఉన్నాయి. అలాగే భారత ఫార్మా ఉత్పత్తులపై అమెరికా సుంకాలను విధించే అవకాశం లేదని కూడా విజయకుమార్ అభిప్రాయపడ్డారు.

ప్రపంచ మార్కెట్ల పరిస్థితి..
ప్రస్తుతం గ్లోబల్ మార్కెట్లు ఎలా ముదుకు సాగుతున్నాయనే విషయాన్ని పరిశీలిస్తే.. నేడు ఇంట్రాడేలో హాంగ్ సెంగ్ సూచీ 11 శాతం, జపాన్ నిక్కీ 7 శాతం, షాంఘై ఎస్‌ఎస్‌ఇ కాంపోజిట్ 6 శాతం, దక్షిణ కొరియా మార్కెట్ సూచీ కోస్పి 5 శాతానికి పైగా నష్టంతో ట్రేడింగ్ కొనసాగిస్తున్నాయి. ఇదే క్రమంలో అమెరికా మార్కెట్లు కూడా రక్తశిత్తంగా కొనసాగుతూ ఇన్వెస్టర్లకు ఆందోళన కలిగిస్తున్నాయి.

ప్ర‌దాన వార్త‌లు

కేటీఆర్‌కు రాజకీయ ఓనమాలు తెలియవు.. అన్న కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి వ్యాఖ్య లను మీరు సమర్థిస్తారా..?
- Advertisment -

Most Popular

WP Tumblr Auto Publish Powered By : XYZScripts.com