Saturday, April 26, 2025

రూ. 20 లక్షలు ఇస్తాం.. ఆచూకీ చెప్పండి

ఉగ్రవాదులు కనిపిస్తే సమాచారం ఇవ్వండి

జమ్ము కశ్మీర్‌లోని ప్రముఖ పర్యాటక ప్రాంతం పెహల్‌గామ్‌లో దాడికి పాల్పడిన ఉగ్రవాదుల కోసం పోలీసు, భద్రతా బలగాలు ముమ్మరంగా గాలింపు చేపడుతున్నాయి. ఈ నేపథ్యంలో ముష్కరులను పట్టుకునేందుకు జమ్ముకశ్మీర్‌ పోలీసులు రివార్డు ప్రకటించారు. ముష్కరుల ఆచూకీ తెలిపిన వారికి రూ.20 లక్షల బహుమతి ఇస్తామని అనంత్‌నాగ్‌ పోలీసులు ప్రకటించారు. ‘ఏప్రిల్‌ 22న పెహల్‌గామ్‌లోని బైసరన్‌లో పర్యాటకులపై దాడికి పాల్పడిన పాకిస్థాన్‌ జాతీయులు, లష్కరే తోయిబా ఉగ్రవాదులు ఆదిల్‌ హుస్సేన్‌ థోకర్‌, అలీ భాయ్‌, హషీమ్‌ ముసాలను బంధించడానికి, లేదా మట్టుబెట్టడానికి ఉపయోగపడే సమాచారం ఇచ్చేవారికి రూ.20 లక్షలు బహుమతిగా ఇస్తాం. వీరి ఆచూకీ చెప్పిన వారి వివరాలను గోప్యంగా ఉంచుతాము’ అని ‘ఎక్స్‌’లో తెలిపారు. ఈ మేరకు ముగ్గురు ముష్కరుల ఊహా చిత్రాలను కూడా పంచుకున్నారు.

ప్ర‌దాన వార్త‌లు

కేటీఆర్‌కు రాజకీయ ఓనమాలు తెలియవు.. అన్న కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి వ్యాఖ్య లను మీరు సమర్థిస్తారా..?
- Advertisment -

Most Popular

WP Tumblr Auto Publish Powered By : XYZScripts.com