Thursday, May 8, 2025

“23” హానెస్ట్ ఫిల్మ్ ని సపోర్ట్ చేయాలి- ప్రియదర్శి

దర్శకుడు రాజ్ ఆర్ నిజమైన సంఘటనల నుంచి ప్రేరణ పొందిన మరో ఆసక్తికరమైన ప్రాజెక్ట్ “23” తో వస్తున్నారు. స్టూడియో 99 నిర్మించిన ఈ చిత్రంలో తేజ, తన్మయి ప్రధాన పాత్రలు పోషించారు. వెంకట్ సిద్దారెడ్డి ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్. ఈ సినిమా ప్రమోషనల్ కంటెంట్ ఇప్పటికే సంచలనం సృష్టించింది. ఈ సినిమాని స్పిరిట్ మీడియా డిస్ట్రిబ్యూషన్ చేస్తుంది. సినిమా మే 16న గ్రాండ్ గా రిలీజ్ కానుంది. తాజాగా మేకర్స్ ట్రైలర్ లాంచ్ చేశారు. హీరో ప్రియదర్శి మాట్లాడుతూ… ఐదేళ్ల క్రితం ఇదే వేదిక మీద మల్లేశం ప్రీ రిలీజ్ ఈవెంట్ చేశాం. ఈ వేడుకకు నన్ను ఇన్వైట్ చేసిన రాజ్ కి థాంక్యూ. నా కెరీర్ కి కొత్త ఊపిరినిచ్చిన వ్యక్తి రాజ్. ఆ కృతజ్ఞతతో ఈ వేడుకకి రావడం జరిగింది. నాకు మల్లేశం లాంటి మంచి సినిమానిచ్చిన రాజ్ కి ఈ వేదిక మీద హృదయపూర్వక కృతజ్ఞతలు తెలుపుతున్నాను. ’23’ సినిమా కథ నాకు తెలుసు. ఈ కథని చేయమని రాజ్ గారు నా దగ్గరికి వచ్చారు. కొన్ని వేరే ప్రాజెక్ట్స్ వల్ల నేను చేయడం కుదరలేదు. చాలా గొప్ప సినిమా ఇది. ఇలాంటి గొప్ప ఆలోచన, కథతో ప్రేక్షకులు ముందుకు వస్తున్న రాజ్ గారిని చూస్తుంటే చాలా గర్వంగా ఉంది. చరిత్రలో ఇలాంటి ప్రశ్నలు అడగడం చాలా అవసరం. రాజుగారు లాంటి డైరెక్టర్ ప్రొడ్యూసర్ ఉండడం తెలుగు సినిమా అదృష్టంగా భావిస్తున్నాను. ఈ ట్రైలర్ చూసిన తర్వాత నేను చేసుంటే బాగుండేదని చిన్నఈర్ష్య కలిగింది. ఇలాంటి ఇంపార్టెంట్ సినిమాని తప్పకుండా ఆడియన్స్ చూడాలి. తెలుగు సినిమా పాటకి కొత్త గౌరవం తీసుకొచ్చిన చంద్రబోస్ గారు ఈ వేదికపై ఉండడం చాలా ఆనందంగా ఉంది. చంద్రబోస్ గారి లాంటి గొప్ప రచయిత ఈ సినిమాకి పని చయడం చేయడం చాలా గర్వంగా ఉంది అన్నారు.

ప్ర‌దాన వార్త‌లు

రాహుల్ గాంధీని విమర్శించే నైతిక అర్హత కేసీఆర్‌కు లేదన్న జగ్గారెడ్డి వ్యాఖ్యలను మీరు సమర్థిస్తారా..?
- Advertisment -

Most Popular

WP Tumblr Auto Publish Powered By : XYZScripts.com