Thursday, January 9, 2025

23 మంది ఐపీఎస్​ల బదిలీ

టెక్నికల్​ సర్వీసెస్​ అడిషనల్​ డీజీగా శ్రీనివాస్​ రావు
పోలీస్​ రిక్రూట్మెంట్​ బోర్డు చైర్మన్​గా అదనపు బాధ్యతలు
ఉమెన్​ సేఫ్టీ వింగ్​కు రమా రాజేశ్వరి
రామగుండం కమిషనర్​గా ఎల్​ఎస్​ చౌహాన్​
జోగుళాంబ జోన్​ డీఐజీగా జోయల్​ డేవిస్​
ఉత్తర్వులు జారీ

రాష్ట్రంలో అధికారుల బదిలీల పర్వం కొనసాగుతున్నది. ఒకే రోజు ఐఏఎస్​, ఐపీఎస్​ల బదిలీ జరిగింది. ముందుగా 26 మంది ఐఏఎస్​లను ట్రాన్స్​ఫర్​ చేయగా.. బుధవారం రాత్రి 23 మంది ఐపీఎస్​లను బదిలీ చేశారు. టెక్నికల్​ సర్వీసెస్​ అదనపు డీజీగా శ్రీనివాస్​రావును నియమించిన ప్రభుత్వం.. టీఎస్​ఎల్​పీఆర్బీ బోర్డు చైర్మన్​గా అదనపు బాధ్యతలను అప్పగించారు. ప్రస్తుతం ఆయన ఇదే పోస్టులో ఉన్నారు. ఆయనకు టెక్నికల్​ సర్వీసెస్​ డీజీగా బాధ్యతలిస్తూ రిక్రూట్​మెంట్​ బోర్డు చైర్మన్​గా అడిషనల్​ బాధ్యతలను ఇచ్చారు. ఇక, పోస్టింగ్​ కోసం వెయిటింగ్​లో ఉన్న గజరావు భూపాల్​ను డీజీపీ కార్యాలయంలో కో ఆర్డినేషన్​ వింగ్​లో నియమించారు. రామగుండం సీపీగా ఉన్న రమా రాజేశ్వరిని ఉమెన్​ సేఫ్టీ వింగ్​ డీఐజీగా బదిలీ చేశారు.

అధికారి                                బదిలీ అయిన స్థానం
వీవీ శ్రీనివాస రావు               టెక్నికల్​ సర్వీసెస్​అడిషనల్​ డీజీ, టీఎస్​ఎల్​పీఆర్బీ చైర్మన్​
గజరావు భూపాల్​                 కో ఆర్డినేషన్​ డీఐజీ
రమా రాజేశ్వరి                    ఉమెన్​ సేఫ్టీ వింగ్​ డీఐజీ
ఎల్​ఎస్​ చౌహాన్​                   సీపీ, రామగుండం
జోయల్​ డేవిస్​                     డీఐజీ, జోగుళాంబ జోన్​
విష్ణు వారియర్​                    వెయిటింగ్​( డీజీపీ ఆఫీస్​లో రిపోర్ట్​ )
పీవీ పద్మజ                          మల్కాజిగిరి డీసీపీ
జానకీ షర్మిల                      నిర్మల్​ ఎస్పీ
ధారవత్​ జానకీ                    ఈస్ట్​జోన్​, డీసీపీ
సునీల్​ దత్​                          ఖమ్మం, సీపీ
రాజేంద్ర ప్రసాద్​                    సీఐడీ, ఎస్పీ
ఉదయ్​ కుమార్​ రెడ్డి              ట్రాన్స్​కో, ఎస్పీ
గౌస్​ ఆలం                            ఆదిలాబాద్​, ఎస్పీ
డా. జీ వినీత్​                       మాదాపూర్​, డీసీపీ
షబరీష్​                                 ములుగు, ఎస్పీ
నితికా పంత్​                        మేడ్చల్ జోన్​​(లాఅండ్​ ఆర్డర్), డీసీపీ
అనురాధ                             సిద్ధిపేట, సీపీ
ప్రవీణ్​ కుమార్​                     ఎల్​బీనగర్​జోన్​, డీసీపీ
బిరోహిత్​ రాజు                     భద్రాద్రి కొత్తగూడెం, ఎస్పీ
బాలస్వామి                          మెదక్​, ఎస్పీ
అశోక్​ కుమార్​                     జయశంకర్​ భూపాలపల్లి, ఓఎస్డీ
వెంకటేశ్వర్లు                         ట్రాఫిక్​–3, డీసీపీ
సీహెచ్​. శ్రీనివాస్​                  రాజేంద్రనగర్​, డీసీపీ

ప్ర‌దాన వార్త‌లు

గోటితో పోయే దాన్ని గోడ్డ‌లి వ‌ర‌కు తెచ్చారు... బ‌న్నీ అరెస్ట్‌ వివాదంపై డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్‌ వ్యాఖ్యలను మీరు సమర్థిస్తున్నారా...?
- Advertisment -

Most Popular

WP Tumblr Auto Publish Powered By : XYZScripts.com