Sunday, March 9, 2025

“23”లో నిజ జీవిత కథని నిజాయితీగా చెప్పాం- డైరెక్టర్ రాజ్ ఆర్

మల్లేశం, 8ఎ.ఎమ్‌. మెట్రో చిత్రాలతో ప్రశంసలు పొందిన దర్శకుడు రాజ్ ఆర్ నిజమైన సంఘటనల నుండి ప్రేరణ పొందిన మరో ఆసక్తికరమైన ప్రాజెక్ట్ “23” తో వస్తున్నారు. స్టూడియో 99 నిర్మించిన ఈ చిత్రంలో తేజ, తన్మయి ప్రధాన పాత్రలు పోషించారు. వెంకట్ సిద్దారెడ్డి ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్. ఈ సినిమాని రానా దగ్గుబాటి స్పిరిట్ మీడియా డిస్ట్రిబ్యూషన్ చేస్తుంది. ఇటీవల ఫస్ట్ లుక్ పోస్టర్‌ను విడుదల చేయడం ద్వారా ప్రమోషన్‌లను ప్రారంభించిన మేకర్స్ ఈరోజు టీజర్‌ ని లాంచ్ చేశారు. 1991 సుండూరు ఊచకోత, 1993 చిలకలూరిపేట బస్సు దహనం, 1997 జూబ్లీ హిల్స్ కార్ బాంబు పేలుడు.. ఈ మూడు సామూహిక హత్యల నేపధ్యంలో “23” టీజర్ గ్రిపింగ్ నెరేటివ్ ని ప్రజెంట్ చేసింది. ఇది న్యాయం కోసం పోరాటం, విషాదాల యొక్క భావోద్వేగ, సామాజిక ప్రభావం, చరిత్రను రూపొందించిన హింస యొక్క కఠినమైన వాస్తవాలను అన్వేషిస్తుంది. టీజర్ లాంచ్ ఈవెంట్ లో దర్శకుడు రాజ్ రాచకొండ మాట్లాడుతూ.. మంచి యాక్టర్స్ దొరకడం ఒక అదృష్టం. నాకు మల్లేశం లో అలాంటి మంచి యాక్టర్స్ దొరికారు. ఆ యాక్టర్స్ అందరికీ మంచి బ్రేక్స్ వచ్చాయి. అనన్య, దర్శి, పుష్ప లో కేశవ అందరూ చాలా మంచి సినిమాలు చేస్తున్నారు. 23 సినిమాకి కూడా అలాంటి మంచి యాక్టర్స్ దొరికారు. మలయాళీ సినిమాలకు ధీటుగా పెర్ఫామ్ చేసే యాక్టర్స్ దొరకడం నిజంగా అదృష్టం. పవన్, తన్మై సినిమా రిలీజ్ కాకుండా ఎడిట్ లో చూసే చాలా బిజీ అయ్యారు. ఝాన్సీ గారి కాంట్రిబ్యూషన్ ని మర్చిపోలేను. మల్లేశం కూడా మంచి పాత్ర చేశారు. ఇందులో కూడా చాలా బరువైన పాత్రలో కనిపించబోతున్నారు. ఇందులో తేజాది చాలా డిఫరెంట్ రోల్. చాలా చక్కగా పెర్ఫార్మ్ చేశాడు. టీజర్ లో చూపించినట్లుగా వీళ్ళ క్రైమ్ తో చనిపోయిన వారు 23 మంది. అందుకే ఈ సినిమాకి ఈ టైటిల్ పెట్టాం. ఈ సినిమా హ్యూమన్ రైట్స్ వైపు వుంటుంది. న్యాయం దొరకని వారి తరపున వుంటుంది. తప్పుని తప్పని తెలుసుకోవడం ఈ సినిమా ఉద్దేశం. ఈ సినిమా హింసకి వ్యతిరేకంగా తీసిన సినిమా. నేను జరిగినదే చూపించాను. బీనా గారు చెప్పిన చాలా విషయాలు ఇందులో చూపించాను. మూడు ఘటనలు జరిగాయి. చాలా మంది చినిపోయారు. అయితే చంపిన వారందరికీ సమానంగా శిక్ష పడిందా లేదా ? అనేది ప్రశ్న. జైలుకి వెళ్ళిన తర్వాత మనిషి పరివర్తనని కూడా సినిమాలో చూపించాం. నేను కనెక్ట్ అయిన కథని చేయాలని భావిస్తాను. ఇప్పటివరకు చేసిన కథలన్నీ అలాంటివే’అన్నారు .

ప్ర‌దాన వార్త‌లు

ఆ మనిషి కార్పొరేట‌ర్‌కు ఎక్కువ... ఎమ్మెల్యేకు త‌క్కువ: పవన్ పై జ‌గ‌న్‌ కామెంట్స్ ను మీరు సమర్థిస్తున్నారా...?
- Advertisment -

Most Popular

WP Tumblr Auto Publish Powered By : XYZScripts.com