Monday, September 30, 2024

ఖరీఫ్‌కు 24.20లక్షల టన్నుల ఎరువులు

  • ఆగస్ట్ వరకూ సరిపడా ఎరువులు పంపండి
  • కేంద్రానికి రాష్ట్ర ప్రభుత్వం లేఖ
  • వ్యవసాయ సమీక్షలో మంత్రి తుమ్మల

రాష్ట్రంలో ముందస్తు ఖరీఫ్ పంటల సాగు మొదలైందని వ్యవసాయశాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు వెల్లడించారు. ఈ సీజన్‌లో పంటలకోసం అన్ని రకాల రసాయనిక ఎరువులు మొత్తం 24.20లక్షల మెట్రిక్ టన్నులు అవసరం అని తెలిపారు. ఇందులో ఆగష్ట్ నెల వరకూ పంటలకు సరిపడా ఎరువులను క్రమం తప్పకుండా సరఫరా చేయాలని కోరుతూ రాష్ట్ర ప్రభుత్వం తరుపున కేంద్రానికి లేఖ రాసినట్టు వెల్లడించారు.

మంత్రి తుమ్మల గురువారం రాష్ట్రస్థాయి వ్యవసాయశాఖ అధికారులతో వానాకాలం పంటసాగు వివరాలు, ఎరువుల నిల్వలు, సరఫరాపై సమీక్ష చేశారు. జూన్ 19వ తేదీ వరకు 17,50,000 ఎకరాలలో వివిధ పంటలు సాగు అయ్యాయని, ఇందులో అత్యధికంగా ప్రత్తి 15,60,677 ఎకరాలలో, తరువాత కంది పంట 76,000 ఎకరాలలో సాగు అయినదని అధికారులు మంత్రికి వివరించారు. రానున్న పక్షము రోజులలో వరి నార్లు పోసుకోవడం, దుక్కులు పూర్త కానున్నందువలన ఆరుతడి పంటలు విత్తుకోవడం ఊపందుకుంటాయని తెలియజేశారు.

వానాకాలం 2024కు సంబంధించి మన రాష్ట్రానికి 10.40 లక్షల మెట్రిక్ టన్నుల యూరియా, 2.40 లక్షల మెట్రిక్ టన్నుల డిఏపి, 10.00 లక్షల మెట్రిక్ టన్నుల కాంప్లెక్స్ ఎరువులు, 0.60 లక్షల మెట్రిక్ టన్నుల మ్యూరేట్ ఆఫ్ పోటాష్ , 1.00 లక్షల మెట్రిక్ టన్నులు ఇతర రకాల రసాయనిక ఎరువులను కేంద్రప్రభుత్వం కేటాయించిందని, జులై చివరి నాటికి 5.65 లక్షల మెట్రిక్ టన్నుల యూరియా అవసరం కాగా ఇప్పటికే 8.35 లక్షల మెట్రిక్ టన్నుల యూరియా, 1.57 లక్షల మెట్రిక్ టన్నుల డిఏపికి గాను 1.47 లక్షల మెట్రిక్ టన్నుల డి.ఏపి, 1.30 లక్షల మెట్రిక్ టన్నుల కాంప్లెక్స్ ఎరువులకు గాను 5.37 లక్షల మెట్రిక్ టన్నుల కాంప్లెక్స్ ఎరువులు, 0.38 లక్షల మెట్రిక్ టన్నుల ఎంఓపి కి గాను 0.26 లక్షల మెట్రిక్ టన్నులు అందుబాటులోకి తెచ్చామని, వీటిలో 1.07 లక్షల మెట్రిక్ టన్నుల యూరియా, 0.54 లక్షల మెట్రిక్ టన్నుల డిఏపి, 1.06 లక్షల మెట్రిక్ టన్నుల కాంప్లెక్స్ ఎరువులను రైతులు కొనుగోలు చేశారని అధికారులు మంత్రికి వివరించారు.

ఈపాస్ ద్వారేనే ఎరువుల విక్రయాలు:
మంత్రి తుమ్మల నాగేశ్వరరావు మాట్లాడుతూ, ఎరువుల సరఫరా పారదర్శకంగా జరగాలని, పూర్తిగా ఈపాస్ ద్వారానే అమ్మకాలు జరిగేటట్లు చూడాలని ఆదేశించారు. ఎవరైనా నిబంధనలు అతిక్రమించి అమ్మకాలు చేసినట్లైతే సదరు డీలర్లు మరియు నిర్లక్ష్యంగా వ్యవహరించే అధికారుల మీద తప్పనిసరిగా చర్యలు తీసుకోవల్సిందిగా ఆదేశించారు. ఇప్పటికే వ్యవసాయశాఖ ద్వారా ప్రవేశపెట్టిన ఈఐవిఎస్ (ఫర్టిలైజర్ ఇన్నోవేటరి వెరిఫికేష్ సిస్టమ్ ) ఆధారంగా వ్యవసాయాధికారులందరూ విధిగా తనిఖీలు చేసి ఎప్పటికప్పుడు విక్రయాలను పరిశీలించవలసిందిగా ఆదేశించారు.

ఎరువుల సరఫరాపై కేంద్రానికి లేఖ:
రాష్ట్రానికి అవసరమైన ఎరువుల సరఫరాకోసం కేంద్ర ప్రభుత్వానికి లేఖరాశారు. సకాలంలో ఎరువులు సరఫరా చేయాలని కేంద్ర రసాయనాలు , ఎరువుల మంత్రిత్వశాఖ మంత్రి జె.పి. నడ్డాను ఉద్దేశించి లేఖ రాశారు. వచ్చే అగస్టు మాసం వరకు సరిపడా ఎరువులను వీలైనంత త్వరగా రాష్ట్రానికి సరఫరా చేసేటందులకు లేఖ ద్వారా కేంద్ర మంత్రికి విజ్ఙప్తి చేశారు. తెలంగాణ రాష్ట్రంలో వానాకాల పంటకాలం ముందుగా ఆరంభమవుతుందని, దానికి తగ్గట్లు రాష్ట్ర ప్రభుత్వం వచ్చే రెండు నెలలకు సరిపడా ఎరువులను ముందుగానే తెప్పించి రైతులకు అందుబాటులో ఉంచేందుకు ప్రణాళిక చేసిందని, తదనుగుణంగా రాష్ట్ర కేటాయింపుల ప్రకారం, ఆగస్టు నెల వరకు కేటాయించిన డి.ఎ.పి , ఇతర ఎరువులను వెంటనే సరఫరా చేసేటట్లు తగిన ఏర్పాట్లు చేయవల్సిందిగా లేఖ ద్వారా కేంద్రమంత్రి నడ్డాకు రాష్ట్ర వ్యవసాయశాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు విజ్ఙప్తి చేశారు.

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌దాన వార్త‌లు

ప్రకాశం బ్యారేజీని బోట్లు ఢీకొట్టడం కుట్రే... ఇందులో జ‌గ‌న్ పాత్ర ఉంది అన్న వర్ల రామయ్య వ్యాఖ్యలను మీరు సమర్థిస్తారా..?
- Advertisment -

Most Popular

Actress Kriti Sanon New Stills

Mrunal Thakur Latest Pics

Actress Shriya Saran new pics