టాలీవుడ్ యాక్టర్ ప్రియదర్శి మంచి పాత్రలు చేస్తూ ప్రస్తుతం లీడ్ రోల్స్‌లో నటిస్తూ ప్రేక్షకులను మెప్పిస్తున్నారు. పెళ్లిచూపులు సినిమాతో పాపులర్ అయిన ప్రియదర్శి ఓ పక్క స్టార్ సినిమాల్లో ఫ్రెండ్ రోల్స్ చేస్తూనే మల్లేశం, బలగం లాంటి సినిమాల్లో లీడ్ రోల్ చేశాడు. అతని సోలో అటెంప్ట్ మల్లేశం మంచి రెస్పాన్స్ తెచ్చుకోగా బలగం సినిమా కమర్షియల్ సక్సెస్ అందుకుంది. ప్రియదర్శి చేస్తున్న సోలో సినిమాలన్నీ కూడా ప్రత్యేకమైన క్రేజ్ తెచ్చుకుంటున్నాయి. ప్రస్తుతం నాని నిర్మాణంలో కోర్ట్ సినిమా చేశాడు ప్రియదర్శి. ఈ సినిమా ప్రమోషన్స్ లో భాగంగా రాం చరణ్ గేమ్ ఛేంజర్ సినిమా గురించి ప్రస్తావించాడు. శంకర్ డైరెక్షన్ లో దిల్ రాజు నిర్మాణంలో తెరకెక్కిన గేమ్ ఛేంజర్ సినిమా ఈ ఇయర్ సంక్రాంతికి రిలీజైంది. ఐతే సినిమా రిజల్ట్ గురించి అందరికీ తెలిసిందే. గేమ్ ఛేంజర్ సినిమాలో ప్రియదర్శి కూడా ఉన్నాడు. 25 రోజుల డేట్స్ దాకా ఇచ్చానని కానీ సినిమాలో తను 2 నిమిషాలు కూడా లేనని అన్నాడు. శంకర్ డైరెక్షన్ లో ఒక సినిమా అయినా చేయాలనే ఆలోచనతో ఈ సినిమా చేశానని చరణ్ అన్న కోసం సినిమా చేశానని చెప్పుకొచ్చాడు ప్రియదర్శి. అంతేకాదు ఆ సినిమా బలగం కన్నా ముందు సైన్ చేశానని చెప్పారు ప్రియదర్శి. కోర్టు సినిమాతో పాటు మోహనకృష్ణ ఇంద్రగంటితో సారంగపాణి జాతకం తో కూడా రాబోతున్నాడు ప్రియదర్శి.