Monday, June 17, 2024

అందుబాటులోకి 25 ఎలక్ట్రిక్ ఏసి, 25 నాన్‌ఏసి ఎలక్ట్రిక్ బస్సులు

జూలై నెలాఖరులోగా మరో 450 ఎలక్ట్రిక్ బస్సులు సిద్ధం

టిజిఎస్ ఆర్టీసి ప్రయాణికుల కోసం మెరుగైన ప్రయాణాన్ని అందించేందుకు చర్యలు చేపడుతోంది. దీంతోపాటు ప్రయాణికుల రద్దీని తగ్గించడానికి ఆర్టీసి కొత్త బస్సులను అందుబాటులోకి తీసుకొస్తుంది. అందులో భాగంగా 25 ఎలక్ట్రిక్ ఏసి, 25 నాన్‌ఏసీ ఎలక్ట్రిక్ బస్సులు నగరానికి చేరుకున్నాయి. జూలై నెలాఖరులోగా మరో 450 ఎలక్ట్రిక్ బస్సులు రోడ్డెక్కనున్నట్టుగా అధికారులు తెలిపారు.హైదరాబాద్ సిటీలో ప్రయాణించేందుకు వీలుగా 125 డీలక్స్ బస్సులను ప్రయాణికుల కోసం అందుబాటులోకి అధికారులు తీసుకురానున్నారు. ఈ బస్సులు జూలై నుంచి అందుబాటులోకి రాబోతున్నాయి. సిటీలోని అన్ని ప్రధాన రహదారుల్లో డీలక్స్ బస్సు సేవలను వినియోగించాలని ఆర్టీసి నిర్ణయించింది. ఇప్పటి వరకు రాష్ట్రంలో సిటీ, ఆర్డినరీ, ఎక్స్‌ప్రెస్ బస్సుల్లో ‘మహాలక్ష్మి పథకం’ కింద మహిళలకు ఉచిత ప్రయాణాలు కొనసాగుతున్నాయి. దీంతో ఈ ఉచిత బస్సుల్లో సీట్లు దొరక్క చాలామంది ప్రయాణికులు ఇబ్బందులు పడుతున్నారు.
ఈ నేపథ్యంలో అలాంటి ప్రయాణికులు సౌకర్యవంతంగా వెళ్లేందుకు వీలుగా ఈ కొత్త డీలక్స్ బస్సులను అందుబాటులోకి తీసుకురాబోతున్నారు. ఇక ఈ బస్సుల్లో ఉచిత ప్రయాణాన్ని అనుమతించరు. కేవలం పెయిడ్ సర్వీస్ పేరుతో ఈ బస్సులను సిటీలో నడుపనున్నారు. కొత్త డీలక్స్ బస్సుల నేపథ్యంలో టికెట్ ధరలు కాస్త ప్రీమియంగా ఉండే అవకాశం ఉందని అధికారులు పేర్కొంటున్నారు.

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌దాన వార్త‌లు

చంద్రబాబు ప్రమాణ స్వీకార వేదికపై తమిళిసైకి అమిత్ షా వార్నింగ్ ఇచ్చారా...?

Most Popular