Sunday, October 6, 2024

పెళ్లైన 4 నెలలకే అమరుడైన ఆర్మీ కెప్టెన్

పెళ్లైన 4 నెలలకే అమరుడైన ఆర్మీ కెప్టెన

8 ఏళ్ల ప్రేమను గుర్తుచేసుకుని భావోద్వేగం

సైన్యంలో పనిచేయడం అంటేనే ప్రాణాలతో చెలగాటమే. ఎప్పుడు ఎక్కడి నుంచి ముప్పు ముంచుకొస్తుందో తెలియదు. అయినా దేశ రక్షణ కోసం లక్షల మంది తమ ప్రాణాలను పణంగా పెట్టి సైన్యంలో పనిచేస్తుంటారు. ఇలా సైన్యంలో పనిచేస్తూ గత సంవత్సరం ప్రాణాలు కోల్పోయిన పంజాబ్‌ రెజిమెంట్‌కు చెందిన 26వ బెటాలియన్‌ కెప్టెన్‌, ఆర్మీ మెడికల్‌ కార్ప్స్‌ డాక్టర్‌ అంశుమన్‌ సింగ్‌‌ కు మరణానంతరం కేంద్ర ప్రభుత్వం కీర్తి చక్ర పురస్కారంతో సత్కరించింది. ఈ అవార్డును కెప్టెన్ అంశుమన్ సింగ్ భార్య స్మృతి సింగ్, అతని తల్లి అందుకున్నారు. అయితే ఈ అవార్డును అందుకునే సమయంలో కెప్టెన్ అంశుమన్ సింగ్ ధైర్య సాహసాల గురించి వివరిస్తుండగా స్మృతి సింగ్ తీవ్ర భావోద్వేగానికి లోనయ్యారు.

అవార్డు స్వీకరించిన తర్వాత స్మృతి సింగ్ తన భర్త కెప్టెన్ అంశుమన్ సింగ్ తో ప్రేమ గురించి గుర్తుచేసుకున్నారు. కాలేజీలో చదువుతున్న సమయంలో తామిద్దరం తొలిసారి కలిసినట్లు స్మృతి సింగ్ చెప్పారు. ఆ పరిచయం కాస్తా ప్రేమగా మారిందని, ఈ క్రమంలోనే ఆర్మీ మెడికల్ కాలేజీకి అంశుమన్ సింగ్ సెలక్ట్ అయినట్లు స్మృతి సింగ్ చెప్పుకొచ్చారు.  ఒకరిని ఒకరు పూర్తిగా అర్థం చేసుకున్న తర్వాత పెళ్లి చేసుకోవాలని నిర్ణయించుకుని.. సుమారు ఎనిమిదేళ్ల పాటు ప్రేమించుకున్నట్లు తెలిపారు. 8ఏళ్ల ప్రేమ తురువాత గత యేడాది 2023 ఫిబ్రవరిలో తమ పెళ్లి జరిగినట్లు చెప్పారు. వివాహమైన 2 నెలలకే అంశుమన్ సింగ్‌ కు సియాచిన్‌ లో పోస్టింగ్ ఇచ్చారని గుర్తుచేసుకున్నారు స్మృతి సింగ్.

అంతలోనే ఈ విషాదం చోటుచేసుకుందని బోరున విలపించింది స్మృతి సింగ్.  తామద్దరం 2023 జులై 18న ఫోన్‌ లో చాలా సమయం మాట్లాడుకున్నట్లు చెప్పారు. పిల్లలు, సొంత ఇల్లు, భవిష్యత్.. ఇలా రాబోయే 50 ఏళ్ల తమ జీవితాన్ని అందంగా ఉంచుకోవాలని ఎన్నో కలలు కన్నామని తెలిపారు. కానీ విధి ఆడిన వింత నాటకంలో ఆ తర్వాత రోజే జులై 19న జరిగిన ప్రమాదంలో కెప్టెన్ అంశుమన్ సింగ్ అమరుడైనట్లు తెలిసిందని ఆమె కన్నీరుపెట్టుకున్నారు. తమ జీవితంలో ఈ విషాదం జరిగి ఏడాది పూర్తవుతున్నప్పటికీ ఇప్పటికీ నమ్మలేకపోతున్నాని స్మృతి సింగ్ అన్నారు. తన భర్త ఓ హీరో అని, ఆయన తమను వదిలి వెళ్లిపోయినా ఎన్నో కుటుంబాలను రక్షించారని స్మృతి సింగ్‌ చెప్పారు.

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌దాన వార్త‌లు

లడ్డూ వివాదంపై సుప్రీంకోర్టు వ్యాఖ్యలను మీరు సమర్థిస్తారా..?
- Advertisment -

Most Popular