Thursday, November 14, 2024

టాలీవుడ్‌ దర్శకుడి రెండో వివాహం

తన కంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న దర్శకుల్లో క్రిష్ జాగర్లమూడి ఒకడు. తన జీవితంలో మరో కొత్త అధ్యాయానికి నాంది పలికాడు. క్రిష్ వివాహం చేసుకోబోతున్నట్లు గత కొంతకాలంగా అనేక రకాల కథనాలు వైరల్ అవుతున్న విషయం తెలిసిందే. ప్రేమ వివాహం చేసుకోవడానికి సిద్ధమైనట్లు టాక్ వచ్చింది. అందుకే షూటింగ్ కి కూడా కాస్త బ్రేక్ ఇచ్చాడు. ఇక ఫైనల్ గా నేడు హైదరాబాద్‌కు చెందిన ప్రముఖ గైనకాలజిస్ట్ డాక్టర్ ప్రీతి చల్లాను ఇటీవల వివాహం చేసుకున్నారు. ప్రీతి చల్లాకు రెండో వివాహం కాగా, క్రిష్‌కు కూడా ఇదే రెండో వివాహం. గతంలో ప్రీతి వివాహం చేసుకున్న కొన్నాళ్ళకు పలు కారణాల వల్ల ఆమె భర్తతో విడాకులు తీసుకుంది. ప్రీతికి కొడుకు కూడా ఉన్నాడు. క్రిష్ గతంలో రమ్య అనే డాక్టర్‌ను వివాహం చేసుకున్న విషయం తెలిసిందే. అయితే, వారి మధ్య కూడా వివాహ సంబంధాలు సజావుగా లేకపోవడంతో 2018లో విడాకులు తీసుకున్నారు. ఆ తర్వాత క్రిష్ సింగిల్‌గా ఉన్నాడు. ఇప్పుడు, ప్రీతి చల్లాతో మరో కొత్త జీవితానికి శ్రీకారం చుట్టడం అందరి దృష్టిని ఆకర్షించింది. ఈ వివాహం హైదరాబాద్‌లోని అత్యంత సన్నిహితుల సమక్షంలో సింపుల్ గా జరిగింది. క్రిష్ సినిమా రంగంలో తన సత్తాను నిరూపించుకున్న దర్శకుల్లో ఒకరు. ఆయన మొదట్లోనే ‘గమ్యం’ చిత్రంతో ప్రేక్షకుల మనసులను గెలుచుకున్నారు. ఈ సినిమా విమర్శకుల ప్రశంసలను అందుకోవడంతో పాటు మంచి కమర్షియల్ సక్సెస్ కూడా సాధించింది.

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌దాన వార్త‌లు

బోనస్ ఇచ్చి ధాన్యం కొంటున్నట్టు రేవంత్ రెడ్డి మహారాష్ట్రలో గప్పాలు కొట్టాడు అన్న హరీశ్ రావు వ్యాఖ్యలను మీరు సమర్థిస్తారా..!
- Advertisment -

Most Popular