Sunday, April 20, 2025

వచ్చే 90 రోజుల్లో మరో 30 వేల పోస్టులు

  • వచ్చే 90 రోజుల్లో మరో 30 వేల పోస్టులు
  • నిరుద్యోగులకు రేవంత్ గుడ్ న్యూస్

రాష్ట్రంలో రానున్న 90 రోజుల్లో 30 వేల ప్రభుత్వ ఉద్యోగాలను భర్తీ చేస్తామని సీఎం రేవంత్​రెడ్డి ప్రకటించారు. తెలంగాణ విపత్తు నిర్వహణ, అగ్నిమాపక శాఖలో భర్తీ అయిన 483 మంది ఫైర్‌మెన్ అభ్యర్థులకు శుక్రవారం శిక్షణ పూర్తికాగా, ఫైర్ మెన్ అభ్యర్థుల పాసింగ్ అవుట్ పరేడ్ జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, మంత్రి శ్రీధర్ బాబు ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా సీఎం రేవంత్ రెడ్డి.. ఫైర్ మెన్ శిక్షణ పూర్తి చేసుకున్న యువకులకు శుభాకాంక్షలు తెలిపారు. శిక్షణ పూర్తి చేసుకున్న మిమ్మల్ని చూసి మీ తల్లిదండ్రులు గుండెల నిండా సంతోషిస్తున్నారన్నారు. ఏ ఆకాంక్షతో యువత తెలంగాణ పోరాటంలో పాల్గొన్నారో.. ఆ ఆకాంక్షను గత ప్రభుత్వం నెరవేర్చలేదని ఆవేదన వ్యక్తం చేశారు. కాంగ్రెస్ అధికారంలోకి రాగానే నిరుద్యోగుల ఆకాంక్షలు నెరవేర్చేందుకు ఉద్యోగ నియామక పత్రాలను పంపిణీ చేశామని, సమాజాన్ని కాపాడాలన్న ఉద్దేశంతో ముందుకు వచ్చిన మీ అందరినీ అభినందిస్తున్నానని రేవంత్ అన్నారు. తమ ప్రభుత్వం ప్రజల ఆలోచనలకు అనుగుణంగా ముందుకు వెళుతోందన్నారు. అందులో భాగంగానే విద్య, వ్యవసాయానికి బడ్జెట్‌లో అత్యధిక నిధులు కేటాయించామని తెలిపారు. ప్రజా ప్రభుత్వం ఆలోచనలకు అనుగుణంగా విద్య, వైద్యానికి బడ్జెట్‌లో ప్రాధాన్యతనిచ్చామని పేర్కొన్నారు.

30 వేల ఉద్యోగాలు భర్తీ

ప్రభుత్వ ఉద్యోగులకు మొదటి తారీఖు జీతం అందించి ఉద్యోగులకు ప్రభుత్వంపై విశ్వాసం కల్పించామని సీఎం రేవంత్ రెడ్డి తెలిపారు. రానున్న 90 రోజుల్లో మరో 30 వేల ఉద్యోగాలను భర్తీ చేయబోతున్నామని, అధికారంలోకి వచ్చి ఏడాది తిరగకముందే 60 వేలకు పైగా ఉద్యోగాలు అందించి నిరుద్యోగుల్లో విశ్వాసం కల్పిస్తున్నామన్నారు. ఎప్పటికప్పుడు ప్రభుత్వ ఉద్యోగ ఖాళీలను భర్తీ చేస్తూ ముందుకెళతామన్నారు. నిరుద్యోగులకు, విద్యార్థులకు ఈ సందర్భంగా రేవంత్ రెడ్డి ఒక సూచన చేశారు. వారికి ఏవైనా సమస్యలు ఉంటే మంత్రులు, ఎమ్మెల్యేలకు విన్నవించాలని రేవంత్ తెలిపారు. మీ సమస్యలను పరిష్కరించేందుకు మీ రేవంతన్నగా మీకు ఎప్పుడూ అండగా ఉంటానని భరోసా ఇచ్చారు.

ప్ర‌దాన వార్త‌లు

కేటీఆర్‌కు రాజకీయ ఓనమాలు తెలియవు.. అన్న కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి వ్యాఖ్య లను మీరు సమర్థిస్తారా..?
- Advertisment -

Most Popular

WP Tumblr Auto Publish Powered By : XYZScripts.com