Sunday, May 11, 2025

33 ఏళ్ల సర్వీస్ లేదా 61 సంవత్సరాల వయో పరిమితిలో ఏదీ ముందు అయితే అదే అమలు..!

ఇది ఫేక్ వార్తగా పేర్కొన్న అధికారులు
ప్రభుత్వ ఉద్యోగి 33 ఏళ్ల సర్వీస్ లేదా 61 సంవత్సరాల వయో పరిమితిలో ఏదీ ముందు అయితే అది అమలు చేసి పదవీ విరమణ పూర్తి చేయాలని ప్రభుత్వం నిర్ణయించినట్టుగా సోషల్‌మీడియాలో శుక్రవారం వైరల్ అయిన వార్త ఫేక్‌గా తేలింది. ప్రస్తుతం ఈ సంవత్సరం మార్చి 31 నుంచి అన్ని శాఖల్లో రాష్ట్రంలో భారీగా పదవీ విరమణలు మొదలయ్యాయి. ఈ సంవత్సరం డిసెంబర్ చివరిలోగా సుమారుగా 8 నుంచి 10 వేల మంది రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులు రిటైర్‌మెంట్ అవుతారని ప్రభుత్వ వర్గాలు పేర్కొంటున్నాయి.

ఈ పరిస్థితుల్లో ప్రభుత్వం కొత్త నిర్ణయంపై సాధారణ పరిపాలన శాఖ ఇప్పటికే సిఎం ఆమోదం కోసం అధికారులు సిఎంవోకు పంపినట్టుగా, అయితే ఎన్నికల కోడ్ ఆమోదానికి ఆటంకంగా మారడంతో కోడ్ తొలగిన వెంటనే ప్రభుత్వం ఆమోదం తెలిపే అవకాశం ఉన్నట్టుగా సోషల్‌మీడియాలో ఒక వార్త చక్కర్లు కొట్టింది. ప్రస్తుతం ఈ విషయమై అధికారులను వివరణ కోరగా అది ఫేక్ వార్త అని అలాంటి ఆలోచన ప్రభుత్వానికి లేదని అధికారులు పేర్కొన్నారు. గత బిఆరెస్ ప్రభుత్వం 2021లో ప్రభుత్వ ఉద్యోగుల పదవీ విరమణ వయసును 58 నుంచి 61 ఏళ్లకు పెంచింది. ప్రస్తుతం ఆ వయో పరిమితి గడువు ముగియడంలో పదవీ విరమణలు ప్రస్తుతం కొనసాగుతున్నాయి.

ప్ర‌దాన వార్త‌లు

రాహుల్ గాంధీని విమర్శించే నైతిక అర్హత కేసీఆర్‌కు లేదన్న జగ్గారెడ్డి వ్యాఖ్యలను మీరు సమర్థిస్తారా..?
- Advertisment -

Most Popular

WP Tumblr Auto Publish Powered By : XYZScripts.com