Tuesday, November 19, 2024

వామ్మో.. ఈ సంక్రాంతి కలెక్షన్ల కింగా… ఎప్పుడూలేనంతగా?

మన భారతదేశంలో అందులోను ఆంధ్రలోను తెలుగు రాష్ట్రాల్లో సంక్రాంతి వచ్చిందంటే చాలు కేవలం కోడిపందా, కొత్త అల్లుళ్ళు మాత్రమే కాదు కొత్త కొత్త సినిమాలు కూడా థియేటర్లలో సందడి చేస్తుంటాయి. పెద్ద హీరోలు సంక్రాంతికి పోటీ పడడం అనేది ఎప్పటి నుంచో వస్తున్న ఆనవాయితీ అనుకోవచ్చు. టాలీవుడ్ లో పెద్ద సినిమాలు పోటీ పడుతూ ఉంటాయి. అలాగే సంక్రాంతి రేసులో రిలీజ్ అయ్యే సినిమాలలో కచ్చితంగా ఒకటి, రెండు హిట్స్ కూడా కొడతాయండోయ్‌. అందుకే ఆ సీజన్ ని టాలీవుడ్ స్టార్స్, నిర్మాతలు, దర్శకులు అందరూ కూడా చాలా వరకు సెంటిమెంట్ గా ఫీల్ అవుతుంటారు. కచ్చితంగా సంక్రాంతి రేసులో తమ సినిమా ఉండాలని ప్రతి పెద్ద హీరో.. పెద్ద నిర్మాత కోరుకునేదే. ఈ ఏడాది సంక్రాంతి బరిలో ఏకంగా నాలుగు తెలుగు సినిమాలు పోటీ పడ్డాయి. సూపర్ స్టార్ మహేష్ బాబు గుంటూరు కారం, తేజా సజ్జా హనుమాన్, విక్టరీ వెంకటేష్ సైంధవ్, కింగ్ నాగార్జున నా సామిరంగా మూవీస్ విడుదలయిన విషయం తెలిసిందే. వీటిలో సంక్రాంతి విన్నర్ గా హనుమాన్ మూవీ నిలిచింది. ఈ సినిమా ఏకంగా 300 కోట్ల గ్రాస్ ని ప్రపంచ వ్యాప్తంగా కలెక్ట్ చేసింది.

ఒక సక్సెస్‌ విషయానికి వస్తే సక్సెస్ పరంగా చూసుకుంటే నా సామిరంగా రెండో స్థానంలో ఉంది. తరువాత గుంటూరు కారం, సైంధవ్ సినిమాలు నిలిచాయి. ఈ నాలుగు సినిమాలు కలిపి బాక్సాఫీస్ దగ్గర ఏకంగా 535 కోట్లు కలెక్ట్ చేసి సంచలన రికార్డ్ క్రియేట్ చేశాయి. ఆల్ టైం సంక్రాంతి సీజన్ హైయెస్ట్ కలెక్షన్స్ గా ఈ నెంబర్ నిలిచింది. హనుమాన్ 300 కోట్ల వరకు కలెక్ట్ చేస్తే, గుంటూరు కారం 180 కోట్ల గ్రాస్ వసూళ్లు చేసింది. నా సామిరంగా సైంధవ్ కలిపి 55 కోట్ల గ్రాస్ కలెక్ట్ చేశాయి. ఈ స్థాయిలో కలెక్షన్స్ ఏ సంక్రాంతి సీజన్ కి రాలేదు. 2020 సంక్రాంతి సీజన్ లో 500 కోట్ల గ్రాస్ వసూళ్లు అయ్యింది. దానిని 2024 బ్రేక్ చేసింది. అయితే కేవలం తెలుగు కలెక్షన్స్ పరంగా చూసుకుంటే మాత్రం 2020 సంక్రాంతి సీజన్ టాప్ చైర్ లో ఉంటుంది. ఓవరాల్ లెక్కలు తీసుకుంటే మాత్రం ఈ సీజన్ ఆల్ టైం నెంబర్ వన్ గా ఉంది. ఈ మధ్యకాలంలో తెలుగు సినిమాల మార్కెట్, స్టామినా పెరుగుతుందని చెప్పడానికి ఈ లెక్కలు చాలనుకుంటా..

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌దాన వార్త‌లు

బోనస్ ఇచ్చి ధాన్యం కొంటున్నట్టు రేవంత్ రెడ్డి మహారాష్ట్రలో గప్పాలు కొట్టాడు అన్న హరీశ్ రావు వ్యాఖ్యలను మీరు సమర్థిస్తారా..!
- Advertisment -

Most Popular