Friday, May 9, 2025

నైజీరియాలో ఘోర ప్రమాదం- 48 మంది మృతి

నైజీరియాలో ఘోర ప్రమాదం జరిగింది. పెట్రోల్ ట్యాంకర్‌ ట్రక్కును ఢీకొట్టిన ఘటనలో మొత్తం 48 మంది చనిపోయారు. నైజీరియాలో లోని నార్త్‌ సెంట్రల్‌ నైగర్‌ స్టేట్ లోని అగాయ్‌ ప్రాంతంలో ఈ ఘోర ప్రమాదం జరిగింది. ప్రయాణికులతో పాటు పశువులను తీసుకెళ్తున్న ట్రక్కును పెట్రోల్ ట్యాంకర్‌ ఢీకొట్టింది. ఆ సమయంలో భారీ పేలుడు సంభవించింది. ఈ సందర్బంగా దగ్గరలో ఉన్న ఇతర వాహనాలకూ మంటలు వ్యాపించాయి.

ఈ ప్రమాదంలో ట్రక్కులో ప్రయాణిస్తున్న పలువురితో పాటు పశువులు సజీవ దహనమయ్యాయి. ఘటనాస్థలికి చేరుకున్న అధికారులు సహాయక చర్యలు చేపట్టారు. ఈ ప్రమాదంలో ఇప్పటికి 48 మంది మృతి చెందారని అధికారులు ప్రకటించారు. మృతుల సంఖ్య పెరిగే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. అగాయ్‌ రహదారి పూర్తిగా మీసివేయడంతో భారీగా ట్రాఫిక్ జామ్ అయ్యింది.

ప్ర‌దాన వార్త‌లు

రాహుల్ గాంధీని విమర్శించే నైతిక అర్హత కేసీఆర్‌కు లేదన్న జగ్గారెడ్డి వ్యాఖ్యలను మీరు సమర్థిస్తారా..?
- Advertisment -

Most Popular

WP Tumblr Auto Publish Powered By : XYZScripts.com