ఈనెల 17వ తేదీ నుంచి 27వ తేదీ వరకు నడపాలని అధికారుల నిర్ణయం
వేసవి సెలవుల నేపథ్యంలో వివిధ ప్రాంతాల మధ్య 48 ప్రత్యేక రైళ్లను నడుపుతున్నట్లు దక్షిణ మధ్య రైల్వే ప్రకటించింది. సికింద్రాబాద్ టు- నాగర్‌సోల్ (07517) సర్వీస్ ఏప్రిల్ 17వ తేదీ నుంచి మే 29వ తేదీల మధ్య నడుస్తుందని అధికారులు తెలిపారు. నాగర్‌సోల్ టు- సికింద్రాబాద్ (07518) సర్వీస్ ఏప్రిల్ 18వ తేదీ నుంచి మే 30వ తేదీల మధ్య ప్రయాణికులకు అందుబాటులో ఉంటుందని, ఇతర వేసవి ప్రత్యేక రైళ్లలో హైదరాబాద్ టు కటక్‌ల మధ్య ఏప్రిల్ 16, 23, 30 తేదీల్లో రైలు నం. 07165, కటక్ టు హైదరాబాద్‌ల మధ్య ఏప్రిల్ 17, 24 మే 1 తేదీల్లో ప్రయాణికులు సద్వినియోగం చేసుకోవాలని అధికారులు సూచించారు. ఇదిలా ఉండగా వేసవి ప్రత్యేక రైలు నంబర్ 07123 ఏప్రిల్ 16 , 23 తేదీల్లో, సికింద్రాబాద్ టు ఉదయపూర్ మధ్య రైలు నెం. 07124 ఉదయపూర్ టు సికింద్రాబాద్‌ల మధ్య ఏప్రిల్ 20, 27 తేదీల్లో నడుస్తుందని అధికారులు తెలిపారు.
సికింద్రాబాద్, నల్గొండ, మిర్యాలగూడ స్టేషన్‌లలో
రైలు నెం. 07165/07166 హైదరాబాద్ -టు కటక్‌ల మధ్య నడిచే ప్రత్యేక రైళ్లు సికింద్రాబాద్, నల్గొండ, మిర్యాలగూడ, సత్తెనపల్లె, గుంటూరు, విజయవాడ, ఏలూరు, రాజమండ్రి, సామర్లకోట, అన్నవరం, అనంకపల్లి, దువ్వాడ, కొత్తవలస, శ్రీకాకుళం, వికాకుళం, పాలసీలలో ఆగుతాయని అధికారులు తెలిపారు.
నిజామాబాద్, బాసర, ధర్మాబాద్ స్టేషన్‌లలో…
రైలు నెం. 07123/07124 సికింద్రాబాద్ -టు ఉదయపూర్ – సికింద్రాబాద్ ప్రత్యేక రైళ్లు మేడ్చల్, కామారెడ్డి, నిజామాబాద్, బాసర, ధర్మాబాద్, ముద్ఖేడ్, నాందేడ్, పూర్ణ, బాస్మత్, హింగోలి దక్కన్, వాషిం, అకోలా, మల్కాపూర్, ఖాండ్వాపల్, ఇత్రాసి ఖాండ్వాపల్, ఖాండ్వాపాల్, ఖాండ్వాపాల్, మేడ్చల్‌లో ఆగుతాయని అధికారులు తెలిపారు.