Monday, March 10, 2025

నయన్‌తారకి అన్ని కోట్లా…?

లేడీ సూపర్‌స్టార్‌ అంటే ఎవరో ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. టాలీవుడ్‌లో నయన్‌తార వరుస సినిమాలు చేస్తూ దూసుకుపోతోంది. గత ఏడాది ‘జవాన్’ సినిమాతో బాలీవుడ్ కి ఎంట్రీ ఇచ్చి సాలిడ్ హిట్ అందుకుంది. మొదటి సినిమాతోనే షారుక్ ఖాన్ లాంటి టాప్ స్టార్ తో నటించి సరికొత్త రికార్డ్ క్రియేట్ చేసింది. ఈ సినిమా కోసం ఏకంగా 11 కోట్ల రెమ్యునరేషన్ అందుకుంది. ప్రస్తుతం సౌత్ ఇండస్ట్రీలో అత్యధిక రెమ్యునరేషన్ తీసుకుంటున్న హీరోయిన్ గా నిలిచింది. సీనియర్ హీరోయిన్ అయినప్పటికీ యంగ్ బ్యూటీలకు పోటీ ఇస్తూ సినిమాలు చేస్తున్న ఈ ముద్దుగుమ్మ ఒక్కో సినిమాకు 6 నుంచి 10 కోట్ల రేంజ్ లో రెమ్యునరేషన్ అందుకుంటోంది.

అలాంటి నయనతార తాజాగా ఓ 50 కోట్ల ఆఫర్ ని రిజెక్ట్ చేసినట్లు సోషల్ మీడియాలో వార్తలు వైరల్ అవుతున్నాయి. నయన్ ని హీరోయిన్ గా ఓ సినిమా కోసం సంప్రదించి రెమ్యూనరేషన్ గా 50 కోట్లు ఇస్తామని చెప్పారట. అయినా కూడా లేడీ సూపర్ స్టార్ అందుకు ఒప్పుకోలేదని సోషల్ మీడియాలో న్యూస్ వైరల్ అవుతుంది. ఇంతకీ ఆ 50 కోట్లు ఆఫర్ ఇచ్చిన ప్రాజెక్ట్ మరేదో కాదు.. తమిళ బిజినెస్ మ్యాన్ శరవణన్ హీరోగా నటించిన ‘ది లెజెండ్’ సినిమా అని ప్రచారం జరుగుతోంది. శరవణన్ హీరోగా నటించిన మొదటి సినిమా ఇది. 2022 లో విడుదలై డిజాస్టర్ గా నిలిచింది. ఇక ఈ విషయం పై ఇంకా క్లారిటీ రావలసి ఉంది. దీని పై నయన్‌ టీమ్‌ ఏ విధంగా స్పందిస్తారో వేచి చూడాలి మరి.

ప్ర‌దాన వార్త‌లు

ఆ మనిషి కార్పొరేట‌ర్‌కు ఎక్కువ... ఎమ్మెల్యేకు త‌క్కువ: పవన్ పై జ‌గ‌న్‌ కామెంట్స్ ను మీరు సమర్థిస్తున్నారా...?
- Advertisment -

Most Popular

WP Tumblr Auto Publish Powered By : XYZScripts.com