చేసిన చాట్ డిలీట్‌కు 50 లక్షలు
పిల్లలను చదివేంచేందుకు పాఠశాలకు ఓ వ్యాపారిపై వలపు వల విసిరి రూ.17 లక్షలు కాజేసిన ప్రీ స్కూల్ నిర్వాహకురాలి బాగోతం బట్టబయలైంది. హనీ ట్రాప్ కు పాల్పడిన ప్రీ స్కూల్ ప్రిన్సిపాల్ సహా, ఇద్దరు రౌడీషీటర్లను బెంగళూరు సీసీబీ పోలీసులు అరెస్టు చేశారు. వివరాల్లోకి వెళితే బెంగుళూరు మహాలక్ష్మి సొసైటీకి చెందిన శ్రీదేవి అనే యువతి ప్రీ స్కూల్ నిర్వహిస్తుంది. అదే ప్రాంతానికి చెందిన ఒక వ్యాపారి 2023 లో తన పిల్లలను శ్రీదేవి నిర్వహించే ప్రీ స్కూళ్లో చేర్పించాడు. ఈ క్రమంలో శ్రీదేవికి వ్యాపారికి పరిచయం ఏర్పడడంతో స్కూల్ నిర్వహణతో పాటు ఇతర ఖర్చులకు రూ.2 లక్షలు అప్పుగా తీసుకొని 2024 లో చెల్లిస్తానని చెప్పింది. ఆ తరువాత వారి మధ్య స్నేహం ముదిరి వివాహేతర సంబంధానికి దారితీసింది. శ్రీదేవి ఆ వ్యాపారి దగ్గర ఒక ముద్దుకు రూ.50 వేలు వసూలు చేసేది. ఇంతలో అప్పుగా తీసుకున్న మొత్తం చెల్లించాలని శ్రీదేవిని వ్యాపారి అడగగా, ఏం కావాలో చెప్తే సెటిల్ చేసుకుందాం అని బదులిచ్చింది. దీంతో లీవ్ ఇన్ రిలేషన్ లో ఉండమని వ్యాపారి కోరడంతో బదులుగా మరో రూ.15 లక్షలు వసూలు చేసింది. అయితే, ఫిబ్రవరిలో మరోసారి డబ్బులు డిమాండ్ చేయడంతో విసుగు చెందిన వ్యాపారి ఆమెకు దూరంగా ఉండడం మొదలు పెట్టాడు. మార్చి 12న శ్రీదేవి వ్యాపారి భార్యకు ఫోన్ చేసి మీ పిల్లల టీసీల కోసం మీ భర్తను పంపమని చెప్పడంతో వ్యాపారి పాఠశాలకు వెళ్లాడు. అక్కడ బీజాపూర్ కు చెందిన గణేష్ కాలె, సాగర్ అనే రౌడీ షీటర్లు అతడిని బెదిరించారు. వారికి, వ్యాపారికి మధ్య వాగ్వాదం నెలకొంది. అనంతరం వారు వ్యాపారి ఇంటికి వెళ్లి కోటీ రూపాయలు డిమాండ్ చేశారు. చివరకు రౌడీ షీటర్లు రూ.20 లక్షలకు ఒప్పందం కుదుర్చుకొని రూ.1.90 లక్షలు అడ్వాన్స్ గా తీసుకొని వ్యాపారిని వదిలేశారు.
మార్చి 17న శ్రీదేవి వ్యాపారికి ఫోన్ చేసి రూ.50 లక్షలు ఇస్తే ఇంతకాలం మన మధ్య జరిగిన వాట్సాప్ చాట్, వీడియోలు డిలీట్ చేస్తానని.. లేదంటే నీ భార్యకు వాటిని పంపుతానని బ్లాక్ మెయిల్ చేసింది. దీంతో విసిగిపోయిన ఆ వ్యాపారి సైబర్ క్రైమ్ పోలీసులకు ఫిర్యాదు చేశాడు. వ్యాపారి ఫిర్యాదు మేరకు రంగంలోకి దిగిన పోలీసులు నిందితులు శ్రీదేవిని, ఇద్దరు రౌడీ షీటర్లు గణేష్ కాలె, సాగర్ మొరెలను అరెస్టు చేసి రిమాండ్ కు పంపించారు.