Sunday, May 11, 2025

Mecca Hajj Yatra: మక్కా హజ్‌ యాత్రలో 550 మంది మృతి

హజ్ నుం సందర్శించిన 18 లక్షల యాత్రికులు

ముస్లింలు జీవితంలో ఒక్కసారైనా సందర్శించాలనుకునే సౌదీలోని హజ్‌ యాత్ర ముగింపు దశకు చేరుకుంది. ఈ దఫా హజ్ యాత్రలో ప్రపంచ నలుమూలల నుంచి వచ్చిన సుమారు 18.3 లక్షల మంది పాల్గొన్నారు. ఐతే హజ్ యాత్రలో పలు కారణాల వల్ల 550 మంది యాత్రికులు మరణించారని అధికారిక వర్గాలు తెలిపాయు.

చనిపోయిన వారిలో అనేక దేశాలకు చెందినవారు ఉండగా.. ఈజిప్టు దేశానికి చెందినవారు అధికంగా 300కు పైగా ఉన్నట్లు తెలుస్తోంది. ఎండల తీవ్రత, ఉక్కపోత వాతావరణమే ఈ మరణాలకు కారణమని హజ్ వర్గాలు ప్రకటించాయి. మక్కాలో ఉష్ణోగ్రతలు అధికస్థాయిలో 50 డిగ్రీల సెల్సియస్‌కు చేరడంతో యాత్రికులు ఉక్కిరిబిక్కిరి అయ్యారు.

హజ్ యాత్రకు వచ్చి మృత్యు వాత పడ్డవారి మృతదేహాలను మక్కా సమీపంలో ఉన్న అలి ముయిసెమ్‌లోని హాస్పిటల్ లో ఉంచినట్లు అధికారిక వర్గాలు తెలిపాయి. డెడ్ బాడీలను ఆయా దేశాలకు అప్పగించేందుకు హజ్ నిర్వాహకులు ఏర్పాట్లు చేస్తున్నారు. ఐతే మృత దేహాలను గుర్తించడం కష్టతరంగా మారిందని, అందుకే ఈ ప్రక్రియ ఆలస్యం అవుతోందని అధికారులు చెప్పారు.

ప్ర‌దాన వార్త‌లు

రాహుల్ గాంధీని విమర్శించే నైతిక అర్హత కేసీఆర్‌కు లేదన్న జగ్గారెడ్డి వ్యాఖ్యలను మీరు సమర్థిస్తారా..?
- Advertisment -

Most Popular

WP Tumblr Auto Publish Powered By : XYZScripts.com