పాల్యం శేషమ్మ, బసిరెడ్డి సమర్పణలో అరుణ కుమారి ఫిలింస్ బ్యానర్‌పై రూపొందుతున్న చిత్రం ‘6జర్నీ’. రవి ప్రకాష్ రెడ్డి, సమీర్ దత్త, టేస్టీ తేజ, పల్లవి, రమ్యా రెడ్డి తదితరులు ప్రధాన పాత్రల్లో నటిస్తున్నారు. బసీర్ అలూరి దర్శకత్వంలో పాల్యం రవి ప్రకాష్ రెడ్డి ఈ సినిమాను నిర్మిస్తున్నారు. ఈ మూవీ ట్రైలర్‌ను మేకర్స్ విడుదల చేశారు. సెన్సార్ సహా అన్నీ కార్యక్రమాలను పూర్తి చేసుకున్న ఈ చిత్రాన్ని ఏప్రిల్ 25న గ్రాండ్ రిలీజ్ చేయబోతున్నారు. ఈ సందర్భంగా దర్శకుడు బసీర్ మాట్లాడుతూ.. ‘మా హీరో సమీర్ ఎంతో కష్టపడి నటించారు. రవి ప్రకాష్ రెడ్డి ఈ మూవీని ముందుండి నడిపించారు. మా హీరోయిన్లు అద్భుతంగా నటించారు. టేస్టి తేజ ఎనర్జీతో నటించాడు. మాకు సింహ మంచి పాటలు ఇచ్చారు. సురేందర్ రెడ్డి మమ్మల్ని ముందుకు నడిపించారు. ఈ మూవీ ఇక్కడకు వచ్చిందంటే అది ఆయన వల్లే. ఆయనకు ఎప్పుడూ రుణపడి ఉంటాను. నాకు ఇంత మంచి ఛాన్స్ ఇచ్చిన మా నిర్మాతకు థాంక్స్. ట్రైలర్‌ను రిలీజ్ చేయండి ఆనందంగా ఉంది. సినిమాను ఏప్రిల్ 25న విడుదల చేస్తున్నాం. సినిమా తప్పకుండా మెప్పిస్తుంది’ అని అన్నారు. హీరో సమీర్ దత్త మాట్లాడుతూ ‘‘డిఫరెంట్ లవ్, యాక్షన్ థ్రిల్లర్‌గా ‘6జర్నీ’ తెరకెక్కింది. ఎంటైర్ టీమ్ ఎంతో కష్టపడ్డాం. బసీర్ సినిమాను బాగా తెరకెక్కించారు. నిర్మాత పాల్యం రవిప్రకాష్‌రెడ్డికి థాంక్స్. ఏప్రిల్ 25న రిలీజ్ కాబోతున్న మా సినిమాను ఆశీర్వదించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను’’ అన్నారు.