2026 మార్చి నాటికి ఎత్తిపోతల పధకం పూర్తి
కాంగ్రెస్ పార్టీ అధినేత్రి సోనియాగాంధీ చే ప్రారంభం
పాలమూరు-, సీతారామ ,దేవాదుల పూర్తికి టైంబౌండ్
భూసేకరణ కు ప్రత్యేక ఐ. ఏ.యస్ అధికారి నియామకం.
ఆధునిక సాంకేతిక పరిజ్ఞానంతో ప్రాజెక్ట్ ల డీ సిల్టింగ్
సీతారామకు67టిఎంసీలతో సి.డబ్ల్యు.సికి ప్రతిపాదన
సమ్మక్క-సారక్క కు ఇప్పటికీ నీటి కేటాయింపులు లేవు
సితక్క లిఫ్ట్ ల ప్రతిపాదనల మంజూరీకీ గ్రీన్ సిగ్నల్
బి.ఆర్.యస్‌లో కమీషన్లకు కక్కుర్తి పడి ప్రాజెక్ట్ లు నిర్మించారు
లక్ష కోట్లు ఖర్చు పెట్టినా లక్ష ఎకరాల కొత్త సేద్యంలోకి రాలేదు
ప్రాజెక్ట్ ల నిర్మాణం పేరుతో లక్షా 80 వేల కోట్లు ఖర్చు చేశారు
14 వేల కోట్ల బిల్లులు పెండింగ్ లో పెట్టారు
నీటిపారుదల శాఖా కేసీఆర్ కుటుంబంతో సర్వనాశనం
శాఖాను అడ్డుపెట్టుకుని లూటీకి పాల్పడ్డారు
ప్రాజెక్ట్ ల పర్యవేక్షణకు త్వరలో 1800 మంది లష్కర్లు
నీటిపారుదల మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి
దేవాదుల ఎత్తిపోతల సాగునీటి ప్రాజెక్టు ద్వారా 60టీఎంసీల గోదావరి నదీజలాలను ఉపయోగించుకుని ఉమ్మడి వరంగల్ జిల్లాలను సస్యశ్యామలం చేయనున్నట్టు రాష్ట్ర నీటిపారుదల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్‌రెడ్డి వెల్లడించారు.2026 మార్చ్ నాటికి దేవాదుల ఎత్తిపోతల పధకం ప్రాజెక్ట్ ను పూర్తి చేస్తామని ప్రకటించారు.నాటి ఏ.ఐ. సి.సి అధినేత్రి సోనియాగాంధీ చేతుల మీదుగా శంకుస్థాపన జరిగిన ఈ ప్రాజెక్ట్ ను అమెతోటే ప్రారంభిస్తామని వెల్లడించారు. రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేక దృష్టి సారించి త్వరితగతిన పూర్తి చేయాలన్న ప్రాధాన్యత క్రమంలో ఉన్న దేవాదుల లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్ట్ పురోగతి పై లిఫ్ట్ ఇరిగేషన్ పంప్ హౌస్ వద్ద శుక్రవారం మంత్రులు ఉత్తమ్ కుమార్ రెడ్డి,పొంగులేటి శ్రీనివాసరెడ్డి, సితక్క లతో పాటు ఉమ్మడి వరంగల్ జిల్లాకు చెందిన ప్రజాప్రతినిధులు నీటిపారుదల శాఖా అధికారులతో ప్రత్యేక సమీక్షా సమావేశం నిర్వహించారు. అనంతరం మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి సహచర మంత్రులు పొంగులేటి, సితక్క ఇతర ప్రజాప్రతినిధులతో మీడియా సమావేశంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి మాట్లాడుతూ ఉమ్మడి వరంగల్ జిల్లాకు జలప్రధయానిగా మారనున్న దేవాదుల పూర్తి అయితే 60 టి యం సి ల నీటితో 300 రోజులు పారి ఇక్కడి పంటపొలాలు సస్యశ్యామలంగా మారుతాయన్నారు. టైం బౌండ్ ప్రోగ్రాంల ద్వారా పాలమూరు-రంగారెడ్డి, సీతారామ సాగర్,దేవాదుల ప్రాజెక్ట్ ల పూర్తి చేస్తామన్నారు. ప్రాజెక్ట్ ల నిర్మాణాలకు భూసేకరణ ఆటంకంగా మారిందన్నారు. బి ఆర్ యస్ ప్రభుత్వం ప్రాజెక్ట్ ల డిజైన్ లు చేసింది కానీ భూసేకరణ జరపలేదన్నారు. ఆటంకాలను అధిగమించేందుకు రాష్ట్ర స్థాయిలో భూసేకరణ కొరకు ప్రత్యేకంగా ఐ. ఏ.యస్ అధికారిని నియమించ నున్నట్లు ఆయన ప్రకటించారు. ప్రాజెక్ట్ లు ఇసుకతో ,మట్టితో పూడి పోతున్నాయని వాటి తొలగింపు కు ఆధునిక పరిజ్ఞానాన్ని వినియోగించ బోతున్నట్లు మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి తెలిపారు.
కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చేంత వరకు కుడా ఖమ్మం జిల్లాలోని సీతారామ ప్రాజెక్ట్ కు నీటి కేటాయింపులు జరగ లేదన్నారు.తాము అధికారంలోకి వచ్చిన మీదటనే సి.డబ్ల్యూ.సి తో సంప్రదింపులు జరిపి 67 టి.యం.సి ల ప్రతిపాదనలు పంపామన్నారు. అనుమతులు చివరి దశకు చేరుకున్నాయాన్నారు. ఇక్కడి సమ్మక్క-సారక్క ల పరిస్థితి అందుకు భిన్నంగా లేదన్నారు. ఇప్పటికీ ఒక్క చుక్క కుడా నీటి కేటాయింపులు లేవు అంటే రైతుల పట్ల బి ఆర్ యస్ కున్న ప్రేమ ఏ పాటిదో అన్నది ఇట్టే అర్థం అవుతుందన్నారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి,ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క లతో పాటు రాష్ట్ర ప్రభుత్వం సమిష్టి గా నిర్ణయం తీసుకుని సమ్మక్క-సారక్క ప్రాజెక్ కు అవసరమైన యన్.ఓ.సి కోసం పొరుగున ఉన్న ఛత్తీస్ ఘడ్ తో సంప్రదింపులు జరుగుతున్నాయన్నారు. ఈ రోజు కూడా నీటిపారుదల శాఖ కార్యదర్శి రాహుల్ బొజ్జ, ఇ. యన్. సి నాగేందర్ రావు లు ఛత్తీస్ ఘడ్ లోనే ఉన్నారన్నారు. సహచర మంత్రి సితక్క ప్రతిపాదించిన లిఫ్ట్ ల మంజురికి మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి ఆమోదం తెలిపారు. అదే విదంగా డీ సిల్టింగ్, జంగిల్ కటింగ్ లకు గాను రూ. 1100 కోట్లు విడుదల చేస్తున్నట్లు మంత్రి ప్రకటించారు. బిల్లుల చెల్లింపుల విషయంలో కాంట్రాక్టర్ల కు ఎటువంటి ఆందోళన అవసరం లేదన్నారు.
కేసిఆర్ కుటుంబం కమీషన్లకు కక్కుర్తి పడింది:
బి ఆర్ యస్ ప్రభుత్వంలో కేసీఆర్ కుటుంబం కమిషన్లకు కక్కుర్తి పడిందని మంత్రి ఉత్తమ్ ఆరోపించారు. అందుకే ప్రాజెక్ట్ ల నిర్మాణం చేపట్టారని ఆయన ఆరోపించారు. లక్ష కోట్లు ఖర్చు పెట్టి నిర్మించిన కాళేశ్వరం ప్రాజెక్ట్ ద్వారా లక్ష ఎకరాల కొత్త ఆయకట్టు సేద్యం లోకి రాక పోవడం సిగ్గు చేటని ఆయన దుయ్యబట్టారు. ప్రాజెక్ట్ ల నిర్మాణం పేరుతో లక్ష 80 వేలు ఖర్చు పెట్టి రాష్ట్రాన్ని అధోగతి పాలు చేశారని ఆయన విరుచుకుపడ్డారు. పైగా 14 వేల కోట్లు విలువ మేరకు బిల్లులు పెండింగ్ లో పెట్టి పోయారని ఆయన విమర్శించారు. ఫార్మ్ హౌజ్ లో కూర్చొని తీసుకున్న నిర్ణయాలతో బావి తరాలు కుడా అప్పుల ఉబి లో చిక్కుక పోయారని మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి ఆవేదన వ్యక్తం చేశారు. మొత్తంగా నీటి పారుదల శాఖాను కేసీఆర్ ఆయన కుటుంబ సభ్యులు కలిసి బ్రష్టు పట్టించారన్నారు.
ఒక్క మాటలో చెప్పాలి అంటే శాఖాను అడ్డుపెట్టుకుని లూటీకి పాల్పడ్డారని ఆయన ఆరోపించారు. నీటిపారుదల శాఖపై రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేక దృష్టి సారించిందన్నారు. ఈ శాఖా బలోపేతం చెయ్యాలి అన్నదే రాష్ట్ర ప్రభుత్వ సంకల్పం అన్నారు.అందులో భాగమే 700 మంది ఏ ఇ ఇ ల నియామకాలు అన్నారు.ప్రాజెక్ట్ ల పర్యవేక్షణ నిమిత్తం త్వరలోనే ఔట్ సోర్సింగ్ పద్దతిలో 1800 మంది లష్కర్ లను నియమించ నున్నట్లు మంత్రి ఉత్తమ్ ప్రకటించారు. అదే సమయంలో నీటిపారుదల శాఖాధికారులు సహకరించాలన్నారు. ఇంత దూరంలో నిర్మిస్తున్న ప్రాజెక్ట్ ల నిర్మాణాలలో శాఖాధికారుల పాత్ర అమూల్యమైనదని, ఇంకొంచెం శ్రమిస్తే శాఖాను మరింత బలోపేతం చేయ వచ్చని మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి నీటిపారుదలశాఖ అధికారులకు ఉద్బోధించారు.