Monday, April 21, 2025

రేపు ఆరో విడుత పోలింగ్​

  • రేపు ఆరో విడుత పోలింగ్​
  • ఈసారి 58 లోక్​సభ స్థానాలకు పోలింగ్​
  • ఢిల్లీలో కీలకం

దేశంలో సార్వత్రిక ఎన్నికల సంగ్రామం తుది అంకానికి చేరుతున్నది. శనివారం ఆరో దశ పోలింగ్‌లో భాగంగా ఢిల్లీ, హర్యానా, బీహార్‌, ఉత్తరప్రదేశ్‌ రాష్టాల్లోని 58 లోక్‌సభ స్థానాలకు పోలింగ్​ జరుగనున్నది. వివిధ రాజకీయ పార్టీలకు చెందిన మొత్తం 889 మంది ఎన్నికల బరిలో నిలబడ్డారు. పోటాపోటీగా సాగిన ఎన్నికల ప్రచారం గురువారంతో ముగిసింది. మనోహర్‌లాల్‌ ఖట్టర్‌ (కర్నాల్‌) దీపేందర్‌ హుడా (రోహ్‌తక్‌), మేనకాగాంధీ (సుల్తాన్‌పూర్‌), మెహబూబా ముఫ్తీ (అనంత్‌నాగ్‌-రాజౌర్‌).. తదితరులు ఈ విడత బరిలో ఉన్నారు. ఇక చివరిదైన 7వ దశ పోలింగ్‌ జూన్‌ 1న జరగనున్నది.

సార్వత్రిక ఎన్నికల ప్రక్రియలో భాగంగా ఇప్పటికే దేశ వ్యాప్తంగా 5 విడతల్లో 428 సీట్లకు పోలింగ్ ప్రక్రియ ముగిసింది. మరో 115 స్థానాలకు ఎన్నికలతో ఈ క్రతువు పూర్తవుతోంది. అందులో ఆరో విడతలో భాగంగా శనివారం దేశ వ్యాప్తంగా హర్యానాలోని 10 స్థానాలు.. కేంద్ర పాలిత ప్రాంతం ఢిల్లీలో 7 స్థానాల.. 3 విడతలో భాగంగా జరగాల్సిన జమ్మూ కశ్మర్‌లోని అనంత నాగ్ రాజౌరితో ఎన్నిక ఇపుడు ఆరో విడతలో నిర్వహిస్తున్నారు. పాటు ఉత్తర ప్రదేశ్‌లోని 14 స్థానాలు, వెస్ట్ బెంగాల్‌లో 7 స్థానాలు, జార్ఖండ్‌లోని 4 స్థానాలు, ఒడిషాలో 6 లోక్ సభ సీట్లతో 42 అసెంబ్లీ సీట్లకు కలిపి మొత్తంగా 58 స్థానాలకు ఎన్నికలు జరగున్నాయి. ఈసారి ఎన్నికల బరిలో హర్యాణలోని కర్నాల్‌ నుంచి ఆ రాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి మనోహర్‌ లాల్ ఖట్టర్, ఒడిషాలోని సంబల్ పూర్ నుంచి ధర్మేంద్ర ప్రధాన్, పూరీ నుంచి సంబిత్ పాత్ర, కురుక్షేత్ర నుంచి నవీన్ జిందాల్, గురుగ్రామ్ నుంచి రావ్ ఇంద్రజిత్ సింగ్, ఉత్తర ప్రదేశ్‌లోని సుల్తాన్ పూర్ నుంచి మేనకా గాంధీ, అనంత్ నాగ్ రాజౌరి నుంచి పీడీపీ ఛీప్ మెహబూబా ముఫ్తీ ఎన్నికల బరిలో ఉన్నారు. అటు నార్త్ ఈస్ట్ దిల్లీ స్థానాం నుంచి బీజేపీ తరుపున మనోజ్ తివారి, కాంగ్రెస్ తరుపున వివాదాస్పద నేత కన్హయ్య కుమార్ బరిలో ఢీ అంటే ఢీ అంటున్నారు.

ప్ర‌దాన వార్త‌లు

కేటీఆర్‌కు రాజకీయ ఓనమాలు తెలియవు.. అన్న కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి వ్యాఖ్య లను మీరు సమర్థిస్తారా..?
- Advertisment -

Most Popular

WP Tumblr Auto Publish Powered By : XYZScripts.com