Friday, April 4, 2025

కల్నల్‌ సంతోష్ బాబు కుటుంబానికి 711 గజాల స్థలం

గాల్వన్‌లో చైనాతో ఘర్షణల్లో అమరుడైన కల్నల్‌ సంతోష్ బాబు భార్య సంతోషికి హైదరాబాద్‌ బంజారాహిల్స్‌ రోడ్‌ నెంబర్‌-14లో 711 చదరపు గజాల స్థలం కేటాయించాలని జీహెచ్‌ఎంసీ నిర్ణయించింది. గురువారం స్టాండింగ్‌ కమిటీ సమావేశంలో టేబుల్‌ ఎజెండాగా ఈ అంశాన్ని సభ్యులు ఆమోదించారు.

మహానగరంలో భవనాలు, యుటిలిటీల గుర్తింపు దిశగా కీలక అడుగు పడింది. జియోగ్రాఫికల్‌ ఐడెంటిఫికేషన్‌ సర్వే (జీఐఎస్‌) ఆధారిత సర్వేకు కమిటీ గ్రీన్‌ సిగ్నల్‌ ఇచ్చింది. టెండర్‌ ప్రక్రియ ద్వారా ఏజెన్సీ ఎంపికకు ఆమోదం తెలిపారు. గ్రేటర్‌లోని భవనాలను గుర్తించి వాటిలో ఆస్తి పన్ను మదింపు జరిగినవెన్ని..? జరగనివెన్ని..? వాస్తవ పన్ను కంటే తక్కువ చెల్లిస్తున్న నిర్మాణాలెన్ని..? అన్నది తేల్చనున్నారు.

ప్ర‌దాన వార్త‌లు

కేటీఆర్‌కు రాజకీయ ఓనమాలు తెలియవు.. అన్న కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి వ్యాఖ్య లను మీరు సమర్థిస్తారా..?
- Advertisment -

Most Popular

WP Tumblr Auto Publish Powered By : XYZScripts.com