Friday, April 11, 2025

ఉద్యోగులు అక్కడికి వెళ్తే 8 లక్షల అదనపు వేతనం

భారీ ఆఫర్ ప్రకటించిన టెక్ దిగ్గజం ఇన్ఫోసిస్

భారత టెక్ దిగ్గజం ఇన్ఫోసిస్‌ తమ ఉద్యోగులకు బంపర్ ఆఫర్ ప్రకటించింది. కర్ణాటక రాష్ట్రంలో హుబ్బళ్లిలో కొత్తగా ఏర్పాటు చేసిన ఐటీ డెవలప్‌మెంట్‌ సెంటర్‌లో పనిచేయడానికి ముందుకు వచ్చిన ఉద్యోగులకు 8 లక్షల రూపాయల వరకు ప్రోత్సాహకం ఇస్తామని పేర్కొంది. ఈ క్రమంలో ఉద్యోగులకు ఇటీవల ఈమెయిల్‌ ద్వారా ఈ ఆఫర్ కు సంబందించిన వివరాలను తెలపింది ఇన్పోసిస్. అభివృద్ధి చెందడానికి మెరుగైన అవకాశాలున్న హుబ్బళ్లిలో పనిచేసే ప్రతిభావంతుల కోసం వేచి చూస్తున్నామని ఈ సందర్బంగా పేర్కొంది.

సంస్థకు చెందిన ప్రాజెక్టు డెవలప్‌మెంట్‌ విధుల్లో ఉన్న బ్యాండ్‌-2, ఆ పైస్థాయి ఉద్యోగులకు బదిలీ ప్రోత్సాహకాలు అందిస్తామని ఇన్ఫోసిస్‌ ప్రకటించింది. దేశంలోని ఏ ఇన్ఫోసిస్ డెవలప్‌మెంట్‌ సెంటర్‌ నుంచైనా ఉద్యోగులు ఇక్కడికి రావొచ్చని తెలిపింది. బ్యాండ్‌ 3, అంతకంటే దిగువస్థాయి ఉద్యోగులకు బదిలీ సమయంలో 25 వేల రూపాయలు అందిస్తామని పేర్కొంది.

ఆ తర్వాత ప్రతీ ఆరు నెలలకు 25 వేల చొప్పున రెండేళ్ల పాటు ఇస్తామని ఇన్ఫోసిస్ ప్రకటించింది. మొత్తానికి హుబ్బెళ్లికి ఇలా ఇతర బ్రాంచీల నుంచి వచ్చి వేరా 1.25 లక్షల ప్రోత్సాహకాలు అందుకోనున్నారన్న మాట. ఇదే క్రమంలో బ్యాండ్‌ 4 ఉద్యోగులకు 2.5 లక్షలు, బ్యాండ్‌ 5 ఉద్యోగులు 5 లక్షలు, బ్యాండ్‌ 6 స్థాయి ఉద్యోగులకు మొత్తం 8 లక్షల ప్రోత్సాహకాలు అందిస్తామని పేర్కొంది ఇన్ఫోసిస్.

ప్ర‌దాన వార్త‌లు

కేటీఆర్‌కు రాజకీయ ఓనమాలు తెలియవు.. అన్న కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి వ్యాఖ్య లను మీరు సమర్థిస్తారా..?
- Advertisment -

Most Popular

WP Tumblr Auto Publish Powered By : XYZScripts.com