తెలంగాణ రాష్ట్రంలో ఎన్నికైన కాంగ్రెస్ ప్రభుత్వం తొలి క్యాబినెట్ సమావేశం హాట్ హాట్‌గా సాగింది. విద్యుత్తుపై రివ్యూ ఎంతో సీరియస్‌గా జరిగిందని సమాచారం. విద్యుత్ శాఖ ప్రిన్సిపల్ సెక్రెటరీ పై సీఎం రేవంత్ రెడ్డి ఆగ్రహం వ్యక్తి చేసినట్లు తెలిసింది. విద్యుత్ శాఖలో ప్రస్తుత పరిస్థితుల్ని దాచిపెట్టడంపై సీఎం సీరియస్ అయ్యారు. విద్యుత్ సంక్షోభం తెచ్చేలా కుట్ర జరిగిందన్నారు. రేపటిలోగా పూర్తి వివరాలతో రావాలని అధికారుల్ని ఆదేశించారు. రేపు ఉదయం విద్యుత్ పై సీఎం ప్రత్యేక సమీక్ష నిర్వస్తారని తెలిసింది. విద్యుత్ శాఖలో ఇప్పటివరకు 85 వేల కోట్ల అప్పులు ఉన్నట్లు సీఎంకు అధికారులు తెలిపారు. సీఎండీ ప్రభాకర్ రావు రాజీనామాను ఆమోదించొద్దని ఆదేశించారు. రేపటి రివ్యూకు ప్రభాకర్ రావు ను రప్పించాలని అధికారులకు ఆదేశాలు జారీ చేశారు.