Wednesday, April 2, 2025

900 రకాల మెడిసిన్ ధరలు పెంచిన కేంద్రం నేటి నుంచి అమల్లోకి పెరిగిన ధరలు

కేంద్ర ప్రభుత్వం నూతన ఆర్థిక సంవత్సరంలో మెడిసిన్ ధరలు అమాంతం పెంచేసింది. కేంద్ర రసాయనాలు, ఎరువుల మంత్రిత్వ శాఖ పరిధిలోని జాతీయ ఔషధ ధరల అథారిటీ 900 పైగా రకాల మెడిసిన్ ధరలను సవరించింది. పెరిగిన ధరలు ఏప్రిల్ 1వ తేదీ నుంచే అమల్లోకి రానున్నాయని జాతీయ ఔషధ ధరల అథారిటీ స్పష్టం చేసింది. గుండె సంబంధిత, డయాబెటిస్, క్రిటికల్ ఇన్‌ఫెక్షన్లకు సంబంధించిన మెడిసిన్లపై సైతం గరిష్టంగా 1.74 శాతం వరకు ధరలు పెరిగాయి. గత ఏడాదిలో పోలిస్తే ఈ సంవత్సరం 0.00551 శాతం అధికంగా ఉంది.

చట్ట ప్రకారం ప్రతి ఏడాది మెడిసిన ధరల సవరణ
ప్రతి సంవత్సరం టోకు ధరల సూచిక ఆధారంగా అవసరమైన ఔషధాల ధరలను సవరిస్తుంటుంది. ‘ ఔషధాల (ధరల నియంత్రణ) చట్టం 2013 (DPCO, 2013) నిబంధనల ప్రకారం.. షెడ్యూల్ చేసిన ఔషధాల ధరలు హోల్‌సేల్ ధరల సూచిక ఆధారంగా ఏటా సవరిస్తారు. 2024-25 ఆర్థిక సంవత్సరానికి ఔషధాల ధరలు 0.00551 శాతం పెరిగాయి. ఇది వార్షిక మార్పు ఆధారంగా ఏప్రిల్ 1 నుంచి అమలులోకి వచ్చింది. ఔషధాల ధరల నియంత్రణ చట్టం, 2013 యొక్క పేరా 2(1)(u)లో పేర్కొన్న విధంగా కొత్త ఔషధాల రిటైల్ ధరను కూడా నిర్ణయిస్తుందని కేంద్ర రసాయనాలు, ఎరువుల శాఖ సహాయ మంత్రి అనుప్రియా పటేల్ వెల్లడించారు.
ఔషధ ధరల నియంత్రణ సంస్థ.. 2023లో ఇదే సమయంలో 2024 సంవత్సరంతో పోల్చితే వార్షిక మార్పు (+) 1.74028 శాతం వరకు పెరిగిందని ఓ ప్రకటనలో తెలిపింది. నొప్పి నివారణ మెడిసిన్ డైక్లోఫెనాక్ టాబ్లెట్‌ రూ.2.09 సీలింగ్ ధరను కలిగి ఉంది. ఇబుప్రోఫెన్ టాబ్లెట్లు దాని 200 mg రూ.0.72, 400 mg డోసేజ్ రూ.1.22 ధర అయింది. యాంటీబయాటిక్ కోసం వాడే అజిత్రోమైసిన్ 250 ఎంజీకి 11.87 రూపాయలు, 500 ఎంజీ గ్రాముల డోసెజ్ ట్యాబ్లెట్ కు రూ.23.98 అయింది.

ఏది ఎంత కాస్ట్‌లీ అవుతోంది (ముఖ్యమైనవి)

– అమోక్సిసిలిన్, క్లావులానిక్ యాసిడ్ కలిగిన డ్రై సిరప్‌ ధర ఒక్క ఎంఎల్‌కు రూ2.09 గా నిర్ణయించారు.
– డైక్లోఫెనాక్ (పెయిన్ కిల్లర్) టాబ్లెట్‌కు గరిష్ట ధర రూ.2.09 అయింది.
– ఇబుప్రోఫెన్ (పెయిన్ కిల్లర్): 200 mg: టాబ్లెట్‌కు రూ.0.72, 400 mg టాబ్లెట్‌కు రూ.1.22.
– డయాబెటిస్ మందులు (డపాగ్లిఫ్లోజిన్ + మెట్‌ఫార్మిన్ హైడ్రోక్లోరైడ్ + గ్లిమెపిరైడ్) టాబ్లెట్‌కు రూ.12.74.
– ఎసిక్లోవిర్ (యాంటీవైరల్) టాబ్లెట్ 200 mg: టాబ్లెట్‌ ధర రూ.7.74, 400 mg: టాబ్లెట్‌కు రూ.13.90.
– హైడ్రాక్సీక్లోరోక్విన్ (యాంటీమలేరియల్): 200 mg టాబ్లెట్‌కు రూ.6.47, 400 mg టాబ్లెట్‌కు రూ.14.04.
జ్వరం, చెవి, కంటి, ముక్కు, అనస్తీషియా, గుండె, డయాబెటిస్, విటమిన్ టాబ్లెట్ల ధరలు పెరిగాయి. బేర్ మెటల్ స్టెంట్లపై గరిష్ట ధరను రూ. 10,692.69కి సవరించగా.. బయోరిసోర్బబుల్ వాస్కులర్ స్కాఫోల్డ్ (BVS)/ బయోడిగ్రేడబుల్ స్టెంట్‌, డ్రగ్-ఎలుటింగ్ స్టెంట్‌ ధర రూ. 38,933.14గా ఫిక్స్ చేశారు.
మొత్తంగా ఈసారి 900 కు పైగా మెడిసిన్ ధరల్ని సవరించారు.

ప్ర‌దాన వార్త‌లు

కేటీఆర్‌కు రాజకీయ ఓనమాలు తెలియవు.. అన్న కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి వ్యాఖ్య లను మీరు సమర్థిస్తారా..?
- Advertisment -

Most Popular

WP Tumblr Auto Publish Powered By : XYZScripts.com