Saturday, June 14, 2025

తెలంగాణలో దారుణం 90 ఏళ్ల వృద్ధురాలిపై రేప్

కామాంధులు ఆగడాలు రోజు రోజుకూ పెరిగిపోతున్నాయి. ఆడది కనిపిస్తే చాలు మృగల్లా చెలరేగిపోతున్నారు. చిన్నా పెద్దా, ముసలి ముతక అనే తేడా లేకుండా కామా పిశాచుల్లా ప్రవర్తిస్తున్నారు. చిన్నపిల్ల నుంచి పండు ముసలి వరకు ఒంటరిగా కనిపిస్తే చాలు ఎక్కడా లేని కామంతో రెచ్చిపోతున్నారు. తాజాగా తెలంగాణలో ఘోరమైన ఘటన జరిగింది. రంగారెడ్డి జిల్లా యాచారంలో కామాంధులు రెచ్చిపోయారు. ఒంటరిగా జీవిస్తున్న90 ఏళ్ల వృద్ధురాలిపై అత్యాచారం చేశారు. ఈ ఘటన సంచలనంగా మారింది. రాత్రి 12 గంటలకు ఆమెను రేప్ చేశారు. ఉదయం పనిమనిషి చూసి పోలీసులకు సమాచారం అందించింది. దీనిపై కేసు నమోదు చేశారు.
ఇంట్లో ఒంటరిగా నిద్రిస్తున్న పండు ముసలవ్వపై ఓ యువకుడు రేప్ చేసిన ఘటన రాష్ట్ర వ్యాప్తంగా సంచలనంగా మారింది. అనంతరం సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని ఆమెను హాస్పిటల్‌కు తరలించారు. పూర్తి వివరాల్లోకి వెళితే.. రంగారెడ్డి జిల్లా యాచారం పోలీస్‌ స్టేషన్‌ పరిధిలో ఓ 90 ఏళ్ల వృద్ధురాలు ఒంటరిగా జీవిస్తుంది. రోజూ మాదిరిగానే బుధవారం రాత్రి తన ఇంట్లో పడుకుంది. అర్థరాత్రి 12 గంటల సమయం అయింది. అప్పుడే ఎవరో డోర్ కొట్టినట్లు అనిపించడంతో వెళ్లి తీసింది. వెంటనే బయటనుంచి 25 ఏళ్ల వయసున్న ఓ యువకుడు ఆ వృద్ధురాలిపై మృగంలా విరుచుకు పడ్డాడు. ఆ సమయంలో వృద్ధురాలు ఏమీ చేయలేక గజగజలాడిపోయింది. ఆమె అరుపులు పెదవి దాటలేకపోయాయి. ప్రతిఘటించే సత్తువ కూడా ముసలవ్వలో లేకపోవడంతో ఆ యువకుడు అత్యాచారం చేసి పరారయ్యాడు. ఆమె మాత్రం స్పృహతప్పి రాత్రంతా అక్కడే పడిపోయింది. ఉదయం వచ్చిన పనిమనిషి రక్తపుమడుగులో పడి ఉన్న ఆ వృద్ధురాలిని చూసి ఒక్కసారిగా షాక్‌కు గురైంది. వెంటనే ఇరుగుపొరుగు వారికి సమాచారం అందించడంతో అంతా అక్కడకు చేరుకున్నారు.
అనంతరం పోలీసులకు సమాచారం అందించారు. వారు ఘటనా స్థలానికి చేరుకుని వృద్ధురాలిని హాస్పిటల్‌కు తరలించారు. ఇదంతా గంజాయి బ్యాచ్ పని కావచ్చని స్థానికులు అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. పోలీసుల ప్రాథమిక విచారణలో.. రేప్‌కు పాల్పడిన వ్యక్తికి మరో ఇద్దరు వ్యక్తులు ఇంటి బయట ఉండి సహకరించినట్లు సమాచారం. కాగా ఆ ముసలావ్వకు ఇద్దరు కొడుకులు, ఒక కూతురు సంతానం. అందులో ఒక కొడుకు విదేశాల్లో ఉంటున్నాడు. మరో కుమారుడు నగరంలోనే జీవిస్తున్నాడు.

ప్ర‌దాన వార్త‌లు

సొంత పార్టీ వాళ్లే ఎంపీగా ఓడించారన్న కవిత వ్యాఖ్యలను మీరు సమర్థిస్తారా..?
- Advertisment -

Most Popular

WP Tumblr Auto Publish Powered By : XYZScripts.com