Monday, April 21, 2025

ఖరీదైన ఇంటిని అమ్మకానికి పెట్టిన బీజేపీ ఎంపీ కంగనా

బాలీవుడ్ హీరోయిన్, బీజేపీ ఎంపీ కంగనా రనౌత్ తన ఇంటిని అమ్మేస్తున్నారన్న వార్తలు ఇటు సినీ పరిశ్రమలో ఎటు రాజకీయరంగంలో ఆసక్తిరేపుతున్నాయి. దేస ఆర్ధిక రాజధాని ముంబైలో అత్యంత ఖరీదైన ప్రాంతం బాంద్రాలో ఉన్న తన ఇంటిని కంగనా అమ్మకానికి పెట్టారన్న న్యూస్ రెండు మూడు రోజులుగా సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. బాంద్రాలోని పాలి హిల్ ప్రాంతంలో ఉన్న తన ఖరీదైన ఇల్లు కమ్ ఆఫీస్ భవనాన్ని సుమారు 40 కోట్ల రూపాయలకు అమ్మాలని కంగనా రనౌత్ నిర్ణయించుకున్నట్లు నేషనల్ మిడియాలో సైతం కధనాలు వస్తున్నాయి.

ఈ బంగ్లా ప్లాట్ సైజ్ 285 మీటర్లు కాగా 3042 చదరపు అడుగుల విస్తీర్ణంలో ఈ భవనాన్ని నిర్మించారు. ఈ భవనంలో కంగనా రనౌత్ తన మణికర్ణిక ఫిల్మ్ కు సంబందించిన కార్యాలయాన్ని నడుపుతున్నారు. 2020లో కంగనా రనౌత్ కు చెందిన ఈ భవనంలోని కొంత భాగాన్ని బృహన్ ముంబై మున్సిపల్ కార్పొరేషన్ అధికారులు అక్రమ నిర్మాణమంటూ కూల్చివేశారు. ఐతే బీఎంసీ అధికారుల నిర్ణయాన్ని సవాల్ చేస్తూ అప్పట్లో కంగనా రనౌత్ బాంబే హైకోర్టును ఆశ్రయించింది. బాంబే హైకోర్టు స్టే ఇవ్వటంతో బీఎంసీ అధికారులు కూల్చివేతను ఆపారు. తన ఇంటిని పాక్షికంగా కూల్చినందుకు 2 కోట్లు పరిహారం కూడా డిమాండ్ చేసింది కంగనా రనౌత్.

ఐతే ఆ తరువాత చోటుచేసుకున్న రాజకీయ పరిణామాల నేపధ్యంలో గత సంవత్సరం మార్చిలో తన డిమాండ్లను వెనక్కి తీసుకుంది కంగనా రనౌత్. ఇదిగో ఇప్పుడు ఈ భవనాన్ని40 కోట్లకు అమ్మాలని భావిస్తున్నట్లు తెలుస్తోంది. మరి ఇప్పటికిప్పుడు కంగనా రనౌత్ తన ఇల్లు కమ్ ఆఫీస్ భవనాన్ని ఎందుకు అమ్మాలనుకుంటుందోనని బాలివుడ్ తో పాటు పొలిటికల్ సర్కిల్స్ లో చర్చ జరుగుతోంది. ఐతే ఈ విషయంపై ఇప్పటి వరకు కంగనా రనౌత్ మాత్రం స్పందించలేదు.

ప్ర‌దాన వార్త‌లు

కేటీఆర్‌కు రాజకీయ ఓనమాలు తెలియవు.. అన్న కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి వ్యాఖ్య లను మీరు సమర్థిస్తారా..?
- Advertisment -

Most Popular

WP Tumblr Auto Publish Powered By : XYZScripts.com