Monday, November 18, 2024

కేంద్ర ప్రభుత్వ పథకాలకు పేర్లు మార్పుతోనే గత వైకాపా పాలన

కృష్ణా(గన్నవరం): కేంద్ర ప్రభుత్వ పథకాలకు పేర్లు మార్పుతోనే గత వైకాపా పాలన కొనసాగిందని భాజపా రాష్ట్ర అధ్యక్షురాలు, ఎంపీ దగ్గుబాటి పురందేశ్వరి వ్యాఖ్యలు చేశారు. పండిట్ దీనదయాళ్ ఉపాధ్యాయ జయంతిని పురస్కరించుకుని గన్నవరం మండలం జక్కులనెక్కలంలో పార్టీ సభ్యత్వ నమోదు కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈసందర్భంగా ఎంపీ పురందేశ్వరి మాట్లాడుతూ.. జగన్ పాలనలో హిందూ దేవాలయాలపై దాడులు జరిగాయన్నారు. జగన్ ఎంత నొక్కేసారో ప్రజలు గమనించి ఎన్నికల్లో ఓడించారని తెలిపారు. బాధ్యతతో మెలుగుతూ సీఎం చంద్రబాబు నాయకత్వంలోని ఎన్డీయే ప్రభుత్వం రాష్ట్రాభివృద్ధికి కట్టుబడి ఉందన్నారు.

ఇటీవల జరిగిన సాధారణ ఎన్నికల్లో ఎన్డీయే కూటమికి ప్రజలు బ్రహ్మరథం పట్టారన్నారు. ప్రపంచంలో ఐదవ ఆర్థిక శక్తిగా భారతదేశం ఎదిగిందన్నారు. 2019లో బీజేపీకి 23 కోట్ల ఓట్లు వచ్చాయని.. 2024 ఎన్నికల్లో 24 కోట్ల ఓట్లు వచ్చాయని తెలిపారు. బీజేపీకి గత ఎన్నికల కంటే ఈ ఎన్నికల్లో ఓట్ల సంఖ్య పెరిగిందన్నారు. ప్రతిపక్షాల దుష్ప్రచారం వల్ల ఎంపీ సీట్ల సంఖ్య కొంచెం తగ్గిందన్నారు. కాంగ్రెస్ రాజ్యాంగ నిర్మాత అంబేద్కర్‌ను అవమానించిందన్నారు.

మోదీ ప్రభుత్వం రాజ్యాంగాన్ని గౌరవిస్తుందని స్పష్టం చేశారు. ఎన్డీయే కూటమి ఏపీకి సుపరిపాలన అందిస్తుందని ప్రజలు అధికారం ఇచ్చారని ఎంపీ పురందేశ్వరి గుర్తుచేశారు. కార్యక్రమంలో భాజపా కిసాన్ మోర్చా రాష్ట్ర అధ్యక్షులు చిగురుపాటి కుమారస్వామి, రాష్ట్ర కార్యదర్శి మట్ట ప్రసాద్ గారు, రాష్ట్ర కార్యవర్గ సభ్యులు పంతం గజేంద్ర తదితరులతో కలిసి సభ్యత్వ నమోదును ప్రారంభించి.. చేకూరే లబ్ధిని వివరించారు.

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌దాన వార్త‌లు

బోనస్ ఇచ్చి ధాన్యం కొంటున్నట్టు రేవంత్ రెడ్డి మహారాష్ట్రలో గప్పాలు కొట్టాడు అన్న హరీశ్ రావు వ్యాఖ్యలను మీరు సమర్థిస్తారా..!
- Advertisment -

Most Popular