Wednesday, November 6, 2024

తెలంగాణ కాన్సిట్యూషన్ క్లబ్ దేశంలో ఒక మోడల్ గా ఉండాలి
* ఆర్కిటెక్చర్ సంస్థల ద్వారా డిజైన్లు రూపొందించండి
* ఆదర్శ్‌నగర్ న్యూ ఎమ్మెల్యే క్వార్టర్స్ స్థలం క్లబ్ నిర్మాణానికి అనుకూలం
* శాసనసభ స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్
* కాన్సిట్యూషన్ క్లబ్ ను సొసైటీగా రిజిస్ట్రేషన్ చేయాలి
* లెజిస్లేచర్ సెక్రటరీకి ఉపముఖ్యమంత్రి భట్టి విక్రమార్క, మంత్రి శ్రీధర్ బాబు ఆదేశం

సభ్యులకు అన్ని వసతులు, సౌకర్యాలు ఉంటూ తెలంగాణ కాన్సిట్యూషన్ క్లబ్ దేశంలోనే ఒక మోడల్ గా ఉండేలా ఆర్కిటెక్చర్ సంస్థల ద్వారా డిజైన్లు రూపొందించాలని శాసనసభ స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్ సూచించారు, శాసనసభ్యుల, శాసనమండలి సభ్యుల, మాజీ సభ్యుల సౌకర్యార్థం నూతన కాన్సిట్యూషన్ క్లబ్ నిర్మాణంపై బుధవారం శాసనసభ భవనం లోని సభాపతి ఛాంబర్ లో సమీక్ష సమావేశం నిర్వహించారు. తెలంగాణ రాష్ట్ర శాసన సభాపతి గడ్డం ప్రసాద్ కుమార్, శాసనమండలి చైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి, ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్క, శాసనసభ వ్యవహారాల శాఖ మంత్రి దుద్దిళ్ళ శ్రీధర్ బాబు, డిప్యూటీ చైర్మన్ బండా ప్రకాష్ ముదిరాజ్, లెజిస్లేచర్ సెక్రటరీ డా. వి నరసింహా చార్యులు, పర్యాటక శాఖ యండి ప్రకాష్ రెడ్డి, రోడ్లు, భవనాల శాఖ అధికారులు ఈ సమావేశంలో పాల్గొన్నారు.

ఆదర్శ్‌నగర్ న్యూ ఎమ్మెల్యే క్వార్టర్స్ స్థలం కాన్సిట్యూషన్ క్లబ్ నిర్మాణానికి అనుకూలంగా ఉంటుందని సమావేశంలో అభిప్రాయపడ్డారు. త్వరితగతిన డిజైన్లు రూపొందించాలని ఆర్‌అండ్‌బి శాఖ అధికారులను స్పీకర్, చైర్మన్, మంత్రులు ఆదేశించారు. రాజస్థాన్, ఢిల్లీలోని కాన్సిట్యూషన్ క్లబ్ ల పనితీరును పరిశీలించి రిపోర్టు తయారు చేయాలని లేజిస్లేచర్ సెక్రటరీ కి ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క, మంత్రి శ్రీధర్ బాబు సూచించారు. కాన్సిట్యూషన్ క్లబ్ ను సొసైటీగా రిజిస్ట్రేషన్ చేయాలని లెజిస్లేచర్ సెక్రటరీని ఉపముఖ్యమంత్రి భట్టి, మంత్రి శ్రీధర్ బాబు ఆదేశించారు.
Legislature Secretary,Deputy Chief Minister,Bhatti Vikramarka,Minister Sridhar Babu

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌దాన వార్త‌లు

మూసీ ప్రాంతంలో కేసీఆర్‌కు ఇల్లు, బెడ్ ఏర్పాటు చేసిన కాంగ్రెస్ నాయకుల నిర్ణయాన్ని మీరు సమర్థిస్తారా..!
- Advertisment -

Most Popular