Saturday, April 5, 2025

బోనాలకు సిఎం రేవంత్ రెడ్డికి ఆహ్వానం

ముఖ్యమంత్రిని కలిసిన దేవాలయ కమిటీ సభ్యులు, ఆలయ అర్చకులు

ఆషాఢమాసం బోనాల సందర్భంగా సిఎం రేవంత్ రెడ్డికి దేవాలయ కమిటీ సభ్యులు ఆహ్వానం అందించారు. గోల్కొండ, సికింద్రాబాద్, లాల్ దర్వాజ దేవాలయ కమిటీ సభ్యులు, ఆలయ అర్చకులు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని ఆయన నివాసంలో కలిశారు. ఆషాఢ మాసంలో ప్రారంభమయ్యే బోనాల పండుగ సందర్భంగా జరిగే వేడుకలకు హాజరు కావాలని రేవంత్ రెడ్డికి ఆహ్వానం పలుకుతూ ఆహ్వాన పత్రికను అందజేశారు. ఈ సందర్భంగా రేవంత్ రెడ్డిని గజమాలతో సత్కరించారు. అనంతరం ఆలయ అర్చకులు సిఎం రేవంత్ రెడ్డికి ఆశీర్వచనం అందించారు.

 

ఈ కార్యక్రమంలో రవాణా శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్, రాజ్యసభ ఎంపి అనిల్ కుమార్ యాదవ్, ఖైరతాబాద్ ఎమ్మెల్యే దానం నాగేందర్ సహా కాంగ్రెస్ ప్రతినిధులు, ఆలయ కమిటీ సభ్యులు పాల్గొన్నారు. కాగా, తెలంగాణలో ప్రత్యేక పండుగగా జరిగే బోనాలు ఆషాఢమాసంలో ప్రారంభం అవుతాయి. ఈ పండుగ కోసం తెలంగాణ ప్రభుత్వం హైదరాబాద్ లో ప్రత్యేక ఏర్పాట్లు చేస్తోంది. ఈ సంవత్సరం ఆషాఢమాసం మొదటి ఆదివారం అయిన జూలై 7వ తేదీన గోల్కొండ కోటలో బోనాలు ప్రారంభం కానున్నాయి. అనంతరం ఉజ్జయిని మహంకాళి, లాల్ దర్వాజ మహంకాళి ఆలయాల్లో ప్రారంభమై ప్రతి గురు, ఆది వారాలు నెల రోజుల పాటు అంగరంగ వైభవంగా ఈ బోనాలు జరుగుతాయి.

ప్ర‌దాన వార్త‌లు

కేటీఆర్‌కు రాజకీయ ఓనమాలు తెలియవు.. అన్న కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి వ్యాఖ్య లను మీరు సమర్థిస్తారా..?
- Advertisment -

Most Popular

WP Tumblr Auto Publish Powered By : XYZScripts.com