దగ్గరుండి ఇద్దరితో రేప్ చేయించిన మహిళ!
ఆదిలాబాద్ జిల్లాలో దారుణ ఘటన వెలుగు చూసింది. పన్నెండేళ్ల బాలికకు మాయమాటలు చెప్పి ఓ మహిళ అడవిలోకి తీసుకెళ్లగా, ఆ బాలికపై ఇద్దరు యువకులు అత్యాచారానికి ఒడిగట్టారు. పోలీసులకు తల్లి ఫిర్యాదు చేయడంతో ఈ విషయం వెలుగులోకి వచ్చింది. దర్యాప్తు ప్రారంభించిన పోలీసులు ఇద్దరు యువకులు, మహిళను అరెస్టు చేశారు. వీరిపై పలు సెక్షన్ల కింద కేసు నమోదు చేశారు. ఆదిలాబాద్ పట్టణంలోని మావల పోలీస్ స్టేషన్ పరిధిలోని ఓ కాలనీకి చెందిన బాలికను అదే ప్రాంతానికి చెందిన 35 ఏళ్ల వివాహిత పథకం ప్రకారం ఆదివారం మధ్యాహ్నం సమీపంలోని అడవిలోకి తీసుకెళ్లింది. ఆమె బంధువు ఇద్దరు యువకులను వెంటబెట్టుకొని వచ్చారు. ఆ తర్వాత వారు ఆ బాలికపై అత్యాచారానికి పాల్పడ్డారు. రాత్రికి ఇంటికి తిరిగొచ్చిన బాలిక, తల్లికి ఈ విషయాన్ని చెప్పింది. దీంతో ఆమె పోలీసులను ఆశ్రయించారు.
బాలిక తల్లి ఫిర్యాదు చేసిన వెంటనే పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు. ప్రాథమిక విచారణ పూర్తి చేసి నిందితులను గుర్తించారు. అనంతరం బాలికను వైద్య పరీక్షల నిమిత్తం రిమ్స్ ఆసుపత్రికి తరలించారు. అనంతరం ఆదివారం రాత్రి నిందితులపై కేసు నమోదు చేశారు. ఇద్దరు యువకులతో పాటు మహిళ, ఆమె బంధువుపై ఇమ్మోరల్ ట్రాఫిక్ యాక్ట్, పోక్సో కేసులు, అత్యాచారం కింద కేసులు నమోదు చేసినట్లు డీఎస్పీ వెల్లడించారు.
35 ఏళ్ల వివాహిత.. పథకం ప్రకారం వచ్చింది. ఆదివారం మధ్యాహ్నం ఆ బాలికను సమీప అడవిలోకి తీసుకెళ్లింది. అత్యాచారానికి పాల్పడిన ఇద్దరు యువకులతోపాటు మహిళ బంధువు ఇమ్మోరల్ గుర్తించారు. వారిపై పోక్సో, ట్రాఫిక్ యాక్ట్, అత్యాచారం కేసులు నమోదు చేసినట్లు డీఎస్పీ చెప్పారు. అనంతరం బాలికకు పరీక్షల నిమిత్తం రిమ్స్ ఆస్పత్రికి తరలిచారు. పిల్లలపై ఇలాంటి అఘాయిత్యాలకు పాల్పడే వారికి కఠినంగా శిక్షించాలని తల్లిదండ్రులకు డిమాండ్ చేస్తున్నారు.