Friday, November 15, 2024

ఈజిప్టులో బయటపడ్డ 3 వేల ఏళ్లనాటి మమ్మీ మొసలి

ఈజిప్ట్ ఈ పేరు వింటే ఎవరికైనా గుర్తుకు వచ్చేది పిరమిడ్. ఆకాశాన్ని తాకేలా అంత ఎత్తున నిర్మించిన పిరమిడ్ లు, వాటిలో ఉండే మమ్మీలకు పెట్టింది పేరు ఈజిప్ట్. కొన్ని వేల సంవత్సరాల చరిత్ర ఉన్న ఈ పిరమిడ్ లు అందులోను మమ్మీల వెనుక చాలా కథలు ప్రాచుర్యంలో ఉన్నాయి. ఈజిప్ట్ లో మతపరమైన ఆచారాల ప్రకారం కొన్ని జంతువులను కూడా బలి ఇచ్చారని ఈ మధ్యనే ఓ అధ్యయనం గుర్తించింది. తాజాగా ఈజిప్ట్ లో ఓ మమ్మీ మొసలిని గుర్తించాడంతో ఈ విషయం వెలుగులోకి వచ్చింది. ఈజిప్ట్ లో గుర్తంచిన మమ్మీ మొసలిని అమెరికాలోని బర్మింగ్‌ హామ్ మ్యూజియం ఆర్ట్ గ్యాలరీలో భద్రపరిచారు.

ఈ మమ్మీ మొసలిని స్కాన్ చేసిన శాస్త్రవేత్తలు దాని పొట్టలో జీర్ణం కాని చేప, చేప హుక్ ను కనుగొని ఆశ్చర్యపోయారు. ఈ మొసలిని వేటాడి పట్టుకొచ్చిన వెంటనే బలి ఇచ్చినట్లు నిర్ధారించారు. పురాతన ఈజిప్టులో మనుషులనే కాకుండా, కొన్ని రకాల జంతువులను సైతం మమ్మిలుగా మార్చేవారని ఆర్కియాలజీ జర్నల్‌ లో పేర్కొన్నారు . ఈ క్రమంలో తాజాగా కనుగొన్న సుమారు మూడు వేల ఏళ్ల నాటి మొసలి మమ్మీ అతి పెద్దదని చెబుతున్నారు. వందల ఏళ్ల క్రితం ఈజిప్టులోని ప్రజలు మొసలి చర్మాన్ని ధరించేవారని అంచనా వేస్తున్నారు. అసలు ఈ మొసలి ఎలా చనిపోయిందో కనుగొనేందుకు యత్నిస్తున్నారు శాస్త్రవేత్తలు. మమ్మీ చేయబడే ముందు మొసలికి ఏం తినిపించారు.. దాని కడుపులో ఇంకా ఆహారం ఎలా మిగిలే ఉంది, అసలు మొసలిని ఎలా చంపారు.. అనే అంశాలపై శాస్త్రవేత్తలు పరిశోధనలు చేస్తున్నారు.

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌దాన వార్త‌లు

బోనస్ ఇచ్చి ధాన్యం కొంటున్నట్టు రేవంత్ రెడ్డి మహారాష్ట్రలో గప్పాలు కొట్టాడు అన్న హరీశ్ రావు వ్యాఖ్యలను మీరు సమర్థిస్తారా..!
- Advertisment -

Most Popular