Monday, March 10, 2025

ఇజ్రాయెల్‌ రాజధాని టెల్‌ అవీవ్‌ లో బాంబు పేలుడు

  • ఇజ్రాయెల్‌ రాజధాని టెల్‌ అవీవ్‌ లో బాంబు పేలుడు
  • హమాస్ ప్రయోగించిన డ్రోన్‌ దాడిగా అనుమానం

ఇజ్రాయెల్‌ లో భారీ బాంబు పేలింది. ఇజ్రాయెల్‌ రాజధాని టెల్‌ అవీవ్‌ లోని ఓ భారీ భవనం సమీపంలో బలమైన పేలుడు సంభవించింది. శుక్రవారం తెల్లవారుజామున జరిగిన ఈ పేలుడుతో ఒక్కసారిగా అంతా ఉలిక్కిపడ్డారు. ఘటన జరిగిన వెంటనే పోలీసులు, బాంబు స్క్వాడ్ ఘటనా స్థలానికి చేరుకుని సహాయక చర్యలు చేపట్టాయి. ఈ బాంబు పేలుడులో మొత్తం ఏడుగురికి తీవ్ర గాయాలయ్యాయి. వీరిలో ఇద్దరి పరిస్థితి విషమంగా ఉన్నట్లు అధికారులు చెప్పారు. ఐతే ఇంకా ఈ ఘటనలో ఇంకా గాయపడినవారెవరైనా ఉన్నారా అన్న కోణంలో పోలీసులు సహాయక చర్యలు చేపట్టారు.

ఇక టెల్‌ అవీవ్‌ లో ఈ బాంబు పేలుడు ఘటనపై దర్యాప్తు చేపట్టింది ఇజ్రాయెల్ ప్రభుత్వం. ఈ పేరుడు ఎలా జరిగిందనే అంశంపై అధికారులు ఇప్పటి వరకూ ఎలాంటి అధికారిక ప్రకటన చేయలేదు. డ్రోన్‌ ద్వార బాంబు పేలుడు జరిగి ఉండవచ్చనే కోణంలో ఇజ్రాయెల్‌ డిఫెన్స్‌ ఫోర్సెస్‌ తనిఖీలు చేపట్టాయి. బాంబు పేలుడు జరిగిన పరిసర ప్రాంతాల్లోని ప్రజలు అప్రమత్తంగా ఉండాలని అధికారులు హెచ్చరించారు. ఘటన జరిగిన ప్రాంతానికి సమీపంలో ఇంకా ఎక్కడైనా పేలుడు పదార్థాలు ఉండే ఛాన్స్ ఉందని, ఎవరూ అటువైపు రావద్దని సూచించారు.

హమాస్‌ కు ఇజ్రాయెల్‌ కు మధ్య చాలా రోజులుగా యుద్ధం జరుగుతోంది. హమాస్‌ ఆధ్వర్యంలోని గాజాపై ఇజ్రాయెల్‌ బాంబులు, రాకెట్స్ తో దాడులు చేస్తూవస్తోంది. ఈ నేపధ్యంలోనే హమాస్ ప్రతీకార చర్యల్లో భాగంగానే ఇజ్రాయెల్‌పై బాంబు దాడి చేసినట్లు అనుమానిస్తున్నారు. టెల్‌ అవీవ్‌ లో జరిగిన బాంబు దాడికి సంబందించిన ఫోటోలు, వీడియోలు సోషల్ మిడియాలో వైరల్ అవుతున్నాయి.

ప్ర‌దాన వార్త‌లు

ఆ మనిషి కార్పొరేట‌ర్‌కు ఎక్కువ... ఎమ్మెల్యేకు త‌క్కువ: పవన్ పై జ‌గ‌న్‌ కామెంట్స్ ను మీరు సమర్థిస్తున్నారా...?
- Advertisment -

Most Popular

WP Tumblr Auto Publish Powered By : XYZScripts.com