జనగామ బీఆర్ఎస్ ఎమ్మెల్యే పల్లా రాజేశ్వర్రెడ్డి ఎన్నికల నిబంధన ఉలంఘించారని జనగామ పోలీస్ స్టేషన్ లో కేసు నమోదైంది. అసెంబ్లీ ఎన్నికల రోజు ఆయన మెడలో గులాబీ కండువా కప్పుకొని పోలింగ్ బూత్కి వెళ్లారు.
అయితే ఆయన మెడలో పార్టీ కండువా కప్పుకొని పోలింగ్ బూత్ కి వెళ్లడంపై అభ్యంతరం వ్యక్తం చేస్తూ ఎలక్షన్ కమిషన్ నిబంధనలు ఉల్లంఘించారని ఫోటో ఆధారంగా జనగామ డీసీసీ అధ్యక్షుడు కొమ్మూరి ప్రతాప్రెడ్డి జనగామ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేయగా పల్లా రాజేశ్వర్రెడ్డిపై పోలీసులు కేసు నమోదు చేశారు.