ఖైరతాబాద్ కాంగ్రెస్ ఎమ్మెల్యే దానం నాగేందర్‌పై కేసు నమోదు అయ్యింది. ప్రభుత్వ స్థలం వ్యవహారంలో ఎమ్మెల్యే దానంతో సహా మరికొందరిపై జూబ్లీహిల్స్ పోలీస్ స్టేషన్‌లో సోమవారం కేసు నమోదైంది. జూబ్లీహిల్స్ రోడ్ నం.69లోని నందగిరిహిల్స్‌లో జీహెచ్ఎంసీ స్థలం చుట్టూ ఉన్న ప్రహరీ గోడను కొందరు కూల్చేసినట్లు హైడ్రా ఎన్‌ఫోర్స్‌మెంట్ అధికారులు గుర్తించారు.
కూల్చివేతతో ఎమ్మెల్యే దానంకు సంబంధం ఉందని, ఆయనపై చర్యలు తీసుకోవాల్సిందిగా హైడ్రా ఎన్‌ఫోర్స్‌మెంట్ ఇన్‌ఛార్జి వి.పాపయ్య పోలీసులకు ఫిర్యాదు చేశారు. ప్రహరీ కూల్చివేత వల్ల ప్రభుత్వానికి రూ.10లక్షల నష్టం వాటిల్లిందని ఫిర్యాదులో తెలిపారు. దీంతో ఆయనపై పోలీసులు కేసు నమోదు చేశారు. దర్యాప్తు చేయనున్నట్లు చెప్పారు.