ఎమ్మెల్సీ కవితకు సుప్రీంకోర్టు బెయిల్ మంజూరు చేయటంపై కేంద్ర మంత్రి బండి సంజయ్ వివాదస్పద వ్యాఖ్యలు చేయటాన్ని బిఅరెస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ తీవ్రంగా ఖండించారు. సుప్రీం కోర్టుకు ఉద్దేశాలు ఆపాదించేలా కామెంట్స్ చేసిన బండి సంజయ్ తీరును తప్పుబట్టారు. ఎమ్మెల్సీ కవిత కు సుప్రీంకోర్టు బెయిల్ మంజూరు చేయటం కాంగ్రెస్, బీఆర్ఎస్ ల విజయమంటూ బండి సంజయ్ ట్వీట్ చేశారు. కాంగ్రెస్ లాయర్ చేసిన కృషితో ఒకరికి బెయిల్ వస్తే.. బీఆర్ఎస్ సపోర్ట్ కారణంగా ఆ లాయర్ రాజ్యసభలో స్థానం పొందారంటూ వివాస్పద వ్యాఖ్యలు చేశారు. ఎమ్మెల్సీ కవిత బెయిల్ కోసం వాదనలు వినిపించిన లాయర్ కు కాంగ్రెస్ తరఫున రాజ్యసభ సీటు వచ్చేలా కేసీఆర్ రాజకీయ చతురత ప్రదర్శించారంటూ ఆయన చేసిన పోస్ట్ లో కామెంట్స్ చేశారు. వైన్ అండ్ డైన్ క్రైమ్ లో పార్టనర్స్ అయిన కాంగ్రెస్, బీఆర్ఎస్ లకు కంగ్రాట్యులేషన్స్ అంటూ ఆయన స్థాయిని మరిచి సుప్రీంకోర్టు తీర్పు ను అపహాస్యం చేసేలా బండి సంబయ్ కామెంట్స్ చేశారు.
దీనిపై కేటీఆర్ తీవ్రంగా మండిపడ్డారు. బండి సంజయ్ ట్వీట్ కు స్పందిస్తూ కేంద్రమంత్రి గా ఉంటూ ఇంత చౌకబారుగా మాట్లాడతారా అని విమర్శించారు. ఇలా దురుద్దేశపూర్వకంగా బండి సంజయ్ చేసిన వ్యాఖ్యలను కోర్టు ధిక్కారం గా పరిగణించాలంటూ సుప్రీంకోర్టు చీఫ్ జస్టిస్ కు కేటీఆర్ విజ్ఞప్తి చేశారు.