Thursday, December 26, 2024

సింగరేణిలో ఉద్యోగం పేరుతో దగా. భార్యాభర్తల ఆత్మహత్య

నేటి సమాజంలో మోసాలు పెరిగిపోతున్నాయి. మరీ ముఖ్యంగా ఉద్యోగాల పేరుతో చాలా మంది అమాయకులు బలవుతున్నారు. భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో ఉద్యోగం ఇప్పిస్తానని 16 లక్షలు తీసుకుని మోసం చేశారన్న ఆవేదనతో భార్యాభర్తలు ఆత్మహత్య చేసుకోవడం కలకలం రేపుతోంది.  చుంచుపల్లి మండలం రాంనగర్‌లో ఈ విషాదకరమైన ఘటన చోటుచేసుకుంది. జూలూరుపాడు మండలం సాయిరాం తండాకు చెందిన హాలావత్‌ రత్నకుమార్‌(34), పార్వతి(30) భార్యాభర్తలు. డిగ్రీ చదివిన రత్నకుమార్‌ రెండేళ్ల నుంచి కొత్తగూడెం విద్యానగర్‌ లోని ఓ షాపింగ్‌మాల్‌లో పనిచేస్తున్నారు. అదే షాపింగ్‌మాల్‌ లో పనిచేసే ఓ వ్యక్తి.. డబ్బులు ఇస్తే సింగరేణి సంస్థలో ఉద్యోగం ఇప్పిస్తానని చెప్పాడు.
సింగరేణిలో ప్రభుత్వ ఉద్యోగం వస్తుందన్న ఆశతో రత్నకుమార్‌ బంగారం తాకట్టు పెట్టి, అప్పులు చేసి సదరు వ్యక్తికి మొత్తం 16 లక్షల వరకు ఇచ్చాడు. ఐతే ఆ తర్వాత సింగరేణిలో ఉద్యోగంపై దళారీ నుంచి ఎటువంటి స్పందన లేకపోవడంతో రత్నకుమార్‌ ఇటీవల నిలదీశాడు. ఆ దళారి పొంతన లేని సమాధానం చెప్పడం, నిర్లక్ష్యంగా వ్యవహరించడమతో తాము మోసపోయామని భార్యాభర్తలు గ్రహించారు. చేసిన అప్పులు ఎలా తీర్చాలో తెలియక ఆందోళనకు గురైన రత్నకుమార్‌, పార్వతి ఇంట్లో  కలుపు మందు తాగారు. కాస్త ఆలస్యంగా విషయం తెలుకున్న రత్నకుమార్‌ తల్లిదండ్రులు ముందు స్థానికంగా ఉన్న ఓ ప్రైవేటు ఆసుపత్రిలో చేర్పించి ప్రాఘమిక చికిత్స అందించారు. పరిస్థితి విషమించడంతో మెరుగైన వైద్యం కోసం హైదరాబాద్‌కు తరలించగా.. చికిత్స పొందుతూ  చనిపోయారు. కేసు నమోదు చేసుకొన్న పోలీసులు విచారణ చేపట్టారు.

ప్ర‌దాన వార్త‌లు

అల్లు అర్జున్ పట్ల రేవంత్ రెడ్డి దారుణంగా వ్యవహరిస్తున్నారన్న డీకే అరుణ వ్యాఖ్యలను మీరు సమర్థిస్తున్నారా...?
- Advertisment -

Most Popular

WP Tumblr Auto Publish Powered By : XYZScripts.com