Monday, November 18, 2024

సియోల్ నుంచి తిరిగివచ్చిన మంత్రుల బృందం

మూసీ పునరుజ్జీవనం ప్రాజెక్టు కోసం దక్షిణ కొరియాలోని నదుల అభివృద్ధిని అధ్యయనం చేసేందుకు వెళ్లిన మంత్రులు పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి, పొన్నం ప్రభాకర్ రెడ్డిల బృందం శుక్రవారం ఉదయం హైదరాబాద్‌కు చేరుకుంది. ఢిల్లీ నుంచి శంషాబాద్ అంతర్జాతీయ విమానాశ్రయానికి చేరుకున్న పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి, పొన్నం ప్రభాకర్, ప్రభుత్వ సలహదారుడు నరేందర్ రెడ్డి, మేయర్ విజయల, ఎమ్మెల్యేలు ప్రకాష్ గౌడ్, కాలే యాదయ్యల బృందానికి గ్రంథాలయ సంస్థ చైర్మన్ మధుసూదన్ రెడ్డి, మాజీ కార్పొరేషన్ చెర్మన్ రవిలతో పాటు పలువురు శంషాబాద్ ఎయిర్‌పోర్టులో కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలు ఘనస్వాగతం పలికారు. సియోల్లో నీటి సరఫరా, పర్యావరణం, ఆర్థిక వ్యవస్థకు కీలకంగా ఉన్న హాన్ నది సియోల్ నగరంలోనే 40 కిలోమీటర్ల మేర ప్రవహిస్తోంది. ఇంచియాన్ నగరంలోని స్మార్ట్ సిటీలను, ఉత్తర, దక్షిణ కొరియా సరిహద్దు ప్రాంతమైన డీమిలిటరైజేషన్ జోన్ (డిఎంజే) వద్ద పర్యటించారు. సియోల్ నగరపాలక సంస్థ నిర్వహిస్తున్న రోజుకు వెయ్యి టన్నుల వ్యర్థాలను రీసైక్లింగ్ చేసి విద్యుత్ ఉత్పత్తి చేస్తున్న మాపో ప్లాంట్ ను సందర్శించారు.

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌దాన వార్త‌లు

బోనస్ ఇచ్చి ధాన్యం కొంటున్నట్టు రేవంత్ రెడ్డి మహారాష్ట్రలో గప్పాలు కొట్టాడు అన్న హరీశ్ రావు వ్యాఖ్యలను మీరు సమర్థిస్తారా..!
- Advertisment -

Most Popular