Tuesday, April 22, 2025

రైల్వే ట్రాక్ పై పడుకున్న తాగుబోతు- అంతలోనే ట్రైన్

  • రైల్వే ట్రాక్ పై పడుకున్న తాగుబోతు- అంతలోనే ట్రైన్
  • ఉత్తరప్రదేశ్‌లో మందుబాబు వీరంగానికి అంతా షాక్

ఒక్కోసారి మంధుబాబులు చేసే పనులు కామెడిగాను, ఆశ్చర్యంగాను ఉంటాయి. ఐతే కొన్ని సార్లు మాత్రం తాగుబోతులు చేసే పనులు షాక్ కు గురి చేస్తుంటాయి. ఇదిగో ఉత్తరప్రదేశ్‌లో ఓ తాగుబోతు రైల్వే అధికారులకు దిమ్మ తిరిగే పనిచేసి కాసేపు టెన్షన్ పెట్టేశాడు. ఉత్తరప్రదేశ్‌ లోని బిజ్నోర్‌ లో ఓవ్యక్తి మద్యం ఫుల్ గా మంది తాగి ఆ మత్తులో రైల్వేట్రాక్‌ పైనే నిద్రపోయాడు. అదే సమయంలో ట్రైన్ వచ్చేసింది. కానీ ఆ వ్యక్తికి మాత్రం ఎలాంటి గాయాలు కాలేదు. అసలు ఏంజరగనట్టే ట్రైన్ వెళ్లిపోయాక కూడా ట్రాక్ పైనే పడుకున్నాడు.

మద్యం మత్తులో ఉన్న ఒక వ్యక్తి స్థానికంగా రైలు ట్రాక్‌ పై నిద్రపోయాడు. అతన్ని గమనించిన ట్రైన్ లోకో పైలట్ అత్యంత వేగంతో ఉన్న రైలును అపలేకపోయాడు. దీంతో అతని పై నుంచే ట్రైన్ వెళ్లిపోయింది. వెంటనే లోకో పైలెట్ పోలీసులకు సమాచారం ఇచ్చాడు. ఏ మాత్రం ఆలస్యం చేసకుండా సంఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు రైల్ ట్రాక్‌ పై హాయిగా నిద్ర పోతున్న తాగుబోతును తట్టి లేపారు. అతనికి ఏ మాత్రం గాయాలు కాకపోవడంతో పోలీసులతో పాటు స్థానికులు ఆశ్చర్యపోయారు. ప్రమాదం నుంచి అతడు సురక్షితంగా బయటపడడంతో ఊపిరి పీల్చుకున్నారు.

సదరు వ్యక్తి కాస్త బక్కపలచగా ఉంటడం, అతడు ట్రాక్ పై పడుకున్న రైల్వే ట్రాక్ కొంత మేర లోపలికి ఉండటంతో అతనిపై నుంచి ట్రైన్ వెళ్లినా గాయాలు కాలేదని అంచనా వేస్తున్నారు. ఇక ఈ తాగుబోతుకు సంబందించిన వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఇంకా ఈ భూమి మీద నూకలు ఉన్నాయి కాబట్టే పై నుంచి ట్రైన్ వెళ్లినా బతికి బత్తకట్టాడని కామెంట్స్ చేస్తున్నారు.

ప్ర‌దాన వార్త‌లు

కేటీఆర్‌కు రాజకీయ ఓనమాలు తెలియవు.. అన్న కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి వ్యాఖ్య లను మీరు సమర్థిస్తారా..?
- Advertisment -

Most Popular

WP Tumblr Auto Publish Powered By : XYZScripts.com