-
మండి బిర్యానీ తిని ఆసుపత్రి పాలైన కుటుంబం.!
-
ఆలస్యంగా వెలుగులోకి వచ్చిన ఘటన
-
శంషాబాద్ ప్రైవేట్ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న బాధితులు
పెళ్లి రోజు కదా అని కుటుంబ సభ్యులతో కలసి ఓ హోటల్ లో మండీ బిర్యానీ తిన్న కుటుంబం ఆస్పత్రి పాలైంది. ఇంకా వారంతా దవాఖానాలో చికిత్స పొందుతున్నారు. రంగారెడ్డి జిల్లా షాద్ నగర్ పట్టణంలో చోటు చేసుకున్న ఈ ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది.
రంగారెడ్డి జిల్లా షాద్ నగర్ పరిధిలోని అప్పరెడ్డిగూడా గ్రామానికి చెందిన కావాలి నరేందర్ తన పెళ్లి రోజు ఉందని షాద్ నగర్ పట్టణంలోని సాయిబాబా ఫ్యామిలీ రెస్టారెంట్ లో కుటుంబ సభ్యులతో కలిసి మండి బిర్యానీ తిన్నారు. ఆ తర్వాత ఇంటికి చేరుకున్న క్రమంలో ఒకరి తర్వాత ఒకరికి వాంతులు విరేచనాలు అయ్యాయి దీంతో శంషాబాద్ ని ప్రైవేట్ ఆసుపత్రిలో అడ్మిట్ అయ్యారు అప్పటికే నరేందర్ కు రక్తపు వాంతులు విరేచనాలు కావడంతో ఐసీయూలో చికిత్స పొందుతున్నాడు. ఆయనతోపాటు ఆయన భార్య మంగమ్మ కుటుంబ సభ్యులు దీక్షిత, తన్విక, అనిరూద్, అభిలాష్, జోష్ణ, సాయి శ్రీకర్ మొత్తం ఎనిమిది మందికి అస్వస్థత కావడంతో ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు.