Sunday, November 17, 2024

గ్రూప్ -2 పరీక్షల వాయిదా పేరుతొ చేస్తున్న నకిలీ ఉద్యమంలో దాగిన కుట్ర

  • గ్రూప్ పరీక్షలు వాయిదా వేసి నియామకాలను అడ్డుకోవాలన్న కుతంత్రాన్ని నిరుద్యోగులు గుర్తించాలి

తెలంగాణ పబ్లిక్ సర్వీస్ నిర్వహించే గ్రూప్ -2 పరీక్షలను వాయిదా వేయాలంటూ నిరుద్యోగులుగా చెప్పుకుంటున్న కొందరు చేస్తున్న ఆందోళన కు లక్షలాది మంది అసలైన నిరుద్యోగులు బలికానున్నారా? రాష్ట్రంలో జరుగుతున్న పరిణామాలను జాగ్రత్తగా పరిశిలిస్తే, ఇదే నిజమనిపిస్తోంది. ప్రభుత్వంలో కాళీగా ఉన్న దాదాపు లక్షకు పైగా వివిధ విభాగాలలో ఉన్న ఉద్యోగ కాళీలను భర్తీ చేయడానికి రాష్ట్ర ప్రభుత్వం తెలంగాణా పబ్లిక్ సర్వీస్ కమీషన్ తో సహా పలు రిక్రూటింగ్ ఆఏజెన్సీలకు అనుమతి నిచ్చింది. సుదీర్ఘ కాలంగా ప్రభుత్వ ఉద్యోగ నియమాకాలకై ఎదురు చూసిన నిరుద్యోగులకు వరుస నోటిఫికేషన్లు ఆనందాన్నిచ్చాయి.

దీనితో, గత సంవత్సరం పైగా తాము చేస్తున్న ప్రయివేటు ఉద్యోగాలకు రాజీనామా చేసి మరీ వివిధ కోచింగ్ సెంటర్లు, ప్రభుత్వం ఆధ్వర్యంలో ప్రతీ జిల్లాలో నిర్వహించే కోచింగ్ సెంటర్లలో చేరి పలు గ్రూప్ ల పరీక్షలకు ప్రిపేర్ అవుతున్నారు. రాష్ట్ర శాసన సభకు మరికొన్ని రోజుల సమయం మాత్రమే ఉండడంతో ఎన్నికల ఫలితాలను తారుమారు చేసే శక్తిఉన్న యువత రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించిన ఉద్యోగాల భర్తీ వైపు మళ్లడంతో ప్రతిపక్ష పార్టీలు ఒక్క సారిగా కంగుతిన్నాయి. దీనితో, ఎలాగైనా, ఈ నియామకాలకు బ్రేక్ వేసి, వాటిని వాయిదా వేసి తిరిగి నిరుద్యోగుల్లో ఒక అశాంతి, నిర్లిప్తత కలిగించాలనే దురుద్దేశంతో ఈ నియామక పరీక్షలకు ఎలాగైనా బ్రేకులు వేయాలని చేసిన, ఇప్పటికీ చేస్తున్న ప్రయత్నమంటూ లేదు.

గ్రూపు -1 పరీక్షల ను కూడా ఇదే మాదిరి కుట్రలతో సాఫీగా సాగిన పరీక్షల ప్రక్రియను పేపర్ లీకేజి చేయడంద్వారా, తిరిగి ఆ పరీక్షను నిర్వహించడంలో తాత్కాలికంగా విజయం సాధించారు. అయినప్పటికీ, అత్యంత పారదర్శకంగా ఈ గ్రూప్ -1 ప్రిలిమినరీ పరీక్షను మళ్ళి విజయవంతంగా పీ.ఎస్.సి నిర్వహించింది. దీనితో, దిమ్మతిరిగిన ఈశక్తులు ఈనెల 29 , 30 తేదీల్లో జరగాల్సిన గ్రూప్ -2 పరీక్షలను వాయిదా వేయాలని మరో కుట్రలకు తెరతీశారు. ఈ పరీక్షల నిర్వహణ తేదీలను 4 నెలల ముందే టీ.ఎస్.పి.ఎస్.సి ప్రకటించింది. ఈ పరీక్షలను వాయిదా వేయాలని చేస్తున్న నకిలీ ఉద్యమానికి వెనుక ఉన్న కుట్రదారులెవరో రాష్ట్ర ప్రజలకు స్పష్టంగా తెలుస్తూనే ఉంది. అయితే, గురుకుల పరీక్షలున్నందున వీటిని వాయిదా వేయాలంటూ వాదాన్ని తీసుకొస్తున్నారు. దీనికి, కొన్ని కోచింగ్ సెంటర్లు కూడా పరోక్షంగా మద్దతు పలుకుతున్నాయంటున్నారు. ఒక్కసారి, పరీక్షలు ముగిసితె, తమ కోచింగ్ సెంటర్లకు తాళాలు పడుతాయని భయంతో ఈ పోటీ పరీక్షలను వాయిదా వేస్తె, తిరిగి షార్ట్ టర్మ్ కోచింగులంటూ, నిరుద్యోగులనుండి వేలాది రూపాయనాలు దండుకోవచ్చనే కుటిల పన్నాగాలు చేస్తున్నారు.

కాగా, గురుకుల నియామకాల పరీక్షలున్నందున ఈ పరీక్షలను వాయిదా వేయాలని చేస్తున్న డిమాండ్ లో ఏమాత్రం వాస్తవం లేదని ప్రభుత్వం స్పష్టం చేస్తోంది. వివరాలను, పరిశీలిస్తే, గురుకుల నియామక బోర్డు 9 వివిధ కాటగిరీలకు చెందిన 9210 ఉద్యోగాలకు నోటిఫికేషన్లు జారీచేసింది. వీటికి, 2 , 63 ,045 మంది నిరుద్యోగులు దరకాస్తు చేసుకున్నారు. . ఈ పోస్టుల నియామకాలకై ఆగస్టు ఒకటవ తేదీ నుండి 23 వతేదీ వరకు పరీక్షల నిర్వహణ తేదీలను ప్రకటించింది. ఇందుకై, 104 పరీక్ష కేంద్రాల్లో నిర్వహణ కూడా చేపట్టింది. ఇప్పటికే, కొన్ని పరీక్షలు కూడా పూర్తయ్యాయి. భారీ ఎత్తున నియామకాలున్న గ్రూప్ -2 పరీక్షలను రద్దు చేసి, కొన్ని వేలల్లో ఉన్న గురుకుల ఉద్యోగ నియామకాలను సాకుగా చూపిస్తూ, గ్రూప్ -2 ను రద్దు చేయాలన్న డిమాండ్ లోనే వారి కుట్ర దాగి ఉందని స్పష్టం అవుతోంది. ఒకవేళ, గ్రూప్ – 2 పరీక్షలను వాయిదా వేస్తె, ఇక ముందు ఈ పరీక్షల నిర్వహణ కష్టమే అంటున్నారు.

రాష్ట్ర పోలీసు నియామక మండలి ద్వారా చేపట్టిన 18, 334 పోలీస్ సబ్ ఇన్స్పెక్టర్లు, కానిస్టేబుల్ ల నియామకాలను కూడా అడ్డుకోవాలని ఇవే శక్తులు అవిశ్రాంతంగా కృషి చేశాయి. పోలీస్ రిక్రూట్మెంట్ లను అడ్డుకోవాలని కోరుతూ అనేక మార్లు కోర్టులకెక్కాయి. కానీ, అత్యంత పకడ్బందీగా, చేపడుతున్న పోలీస్ నియామకాల పక్రియలో జోక్యం చేసుకోవడానికి కోర్టులు కూడా నిరాకరించడంతో ఇప్పటికే, సబ్ ఇన్స్పెక్టర్ల నియామక తుది జాబితాను కూడా ప్రకటించారు. మరి కొన్ని రోజుల్లో కానిస్టేబుల్ మెరిట్ లిస్ట్ ను ప్రకటించనున్నారు.

మరో రెండు నెలల్లో అసెంబ్లీ ఎన్నికలు జరుగుతుండడం, ఈ ఎన్నికల ప్రక్రియ పూర్తి దాదాపు రెండున్నర నెలలు పట్టడంతో గ్రూప్ టూ పరీక్షల నిర్వహణ ఏమాత్రం సాధ్యం కాదని భావిస్తున్నారు. క్షేత్ర స్థాయిలో ప్రభుత్వ యంత్రాంగం, పోలీసులు మొత్తం ఎన్నికల విధుల్లో నిమగ్నం కావడం వల్లఈ పరీక్షల నిర్వహణ ఏమాత్రం సాధ్యం కాదు. వీటితో పాటు, గ్రూప్ – 3 పరీక్షతోపాటు, డీఏఓ, హాస్టల్ వార్డెన్, అధ్యాపకుల నియామకం తదితర నోటిఫికేషన్ల పరీక్షా నిర్వహణ తేదీల ఖరారు ఇప్పట్లో సాధ్యం కాదని భావిస్తున్నారు.

ఎన్నికల నోటిఫికేషన్ నాటికే ఈ నియామక పరీక్షల ను పూర్తి చేయకపోతే, వీటి పని ఇంతేసంగతులుఅని కూడా నిరుద్యోగులను హెచ్చరిస్తున్నారు. అయితే, ఈ పోటీ పరీక్షలకు శ్రద్దగా ప్రిపేర్ అవుతున్న అభ్యర్థుల్లో అసహనం రేకెత్తించి, ప్రభుత్వానికి వ్యతిరేకంగా మార్చాలనే విపక్షాలు చేస్తున్న కుట్రలకు బలికావద్దని పలువురు మేధావులు, విద్యావేత్తలు హెచ్చరిస్తున్నారు.

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌దాన వార్త‌లు

బోనస్ ఇచ్చి ధాన్యం కొంటున్నట్టు రేవంత్ రెడ్డి మహారాష్ట్రలో గప్పాలు కొట్టాడు అన్న హరీశ్ రావు వ్యాఖ్యలను మీరు సమర్థిస్తారా..!
- Advertisment -

Most Popular