కన్యాదానం సినిమా గుర్తుంది కదా.. తెలుగులో వచ్చిన ఈ సినిమాలో హీరో తన భార్య ప్రేమించిన వ్యక్తికి ఇచ్చి పెళ్లి చేస్తాడు. ప్రేమించిన వాడికిచ్చి తన భార్యను కన్యాదానం చేస్తాడు. అప్పట్లో ఈ సినిమా సంచలనమే అని చెప్పాలి. ఇలాంటి సంఘటనలు సినిమాల్లోనే తప్ప నిజ జీవితంలో జరగవని అందరికి తెలుసు. కానీ ఇలాంటి అరుదైన సంఘటన బీహార్లో చోటుచేసుకుంది. బీహార్ కు చెందిన ఒక వ్యక్తి తన భార్యను ఆమె ప్రేమించిన వ్యక్తి ఇచ్చి పెళ్లిచేయడం ఆసక్తికరంగా మారింది.
బీహార్ కు చెందిన రాజేష్ కుమార్ (26)కు ఖుష్బూ కుమారి (22)తో పెళ్లైంది. 2021లో వివాహం జరగ్గా వీళ్లిద్దరు అన్యోన్యంగానే ఉంటూ వస్తున్నారు. ఐతే భార్య ఖుష్బూ కుమారి ఎప్పుడూ ముబావకంగా ఉండటాన్ని రాజేశ్ కుమార్ గమనించాడు. వీళ్లిద్దరికి కొడుకు కూడా పుట్టాడు. తల్లి అయిన తర్వాత ఖుష్బూ తాను ప్రేమంచిన చందన్ తో తరచూ ఫోన్లో మాట్లాడటం మొదలుపెట్టింది. ఈ క్రమంలో ఓ రోజు ఖుష్బూ కుమారి ప్రియుడు చందన్తో కలిసి ఉండటాన్ని ఆమె అత్తా మామలు చూశారు. అర్ధరాత్రి ప్రియున్ని ఆమె ఇంటికే పిలిపించుకుంది.
ఈ విషయాన్ని కొడుకుకు చెప్పారు వాళ్లు. దీంతో ఏంజరిగిందని భార్య ఖుష్బూ కుమారిని అడిగి ఆమె ప్రేమ గురించి తెలుసుకున్నాడు. భార్య ప్రేమించిన ప్రియుడు చందన్ తో ఆమెకు వివాహం జరిపించాడు రాజేశ్. ఇద్దరూ ఎంతో గాఢంగా ప్రేమించుకున్నారని, వారి జీవితాల్లో సంతోషాన్ని తీసుకురావడానికి నేను నా భార్యను ఆమె ప్రియుడితో పెళ్లి చేశాను.. వారిద్దరు సంతోషంగా ఉండాలని కోరుకుంటున్నట్లు చెప్పుకొచ్చాడు రాజేశ్ కుమార్. పెద్ద మనసుతో తన ప్రేమను అర్ధం చేసుకున్న మొదటి భర్త రాజేశ్ కు కృతజ్ఞతలు చెప్పింది ఖుష్బూ కుమారి.