Saturday, April 19, 2025

ఫోన్ ట్యాపింగ్ వ్యవహారంలో కీలక పరిణామం

  • ఉన్నతాధికారికి ఫోన్ చేసిన ప్రధాన సూత్రధారి
  • ప్రణీత్ రావు, ఇద్దరు అదనపు ఎస్పీలు భుజంగరావు, తిరుపతన్నల
  • కస్టడీ కోరుతూ నేడు పిటిషన్ దాఖలు
  • నాగోలు మూసీ వంతెన కింద హార్డ్ డిస్క్ భాగాలు స్వాధీనం
  • బిఆర్‌ఎస్ నేతలకు నోటీసులు?
  • కొత్తగా రవిపాల్ పేరు తెరపైకి
  • ఇజ్రాయిల్ నుంచి ట్యాపింగ్ డివైజ్‌లు దిగుమతి?

ఫోన్ ట్యాపింగ్ వ్యవహారంలో మరో కీలక పరిణామం చోటు చేసుకుంది. ఈ వ్యవహారంలో ప్రధాన సూత్ర ధారి గా ఆరోపణలు ఎదుర్కొంటున్న ఇంటెలిజెన్స్ మాజీ చీఫ్ ప్రభాకర్ రావు తాజాగా ఓ ఉన్నతాధికారికి ఫోన్ చేసినట్లు సమాచారం. ఈయన ప్రస్తు తం అమెరికాలో ఉన్నారు. ఈ సందర్భంగా తాను క్యాన్సర్ చికిత్స కోసం అమెరికాకు వచ్చానని జూన్ లేదా జులైలో తిరిగి హైదరాబాద్ కు వస్తానని చెప్పినట్లు తెలుస్తోంది. ’ఇప్పుడు ప్రభుత్వం చెప్తే మీరు ఎలా పని చేస్తున్నారో అప్పటి ప్రభుత్వం చెప్తే మేం కూడా అలాగే చేశాం.’ అని సదరు ఉన్నతాధికారితో అన్నట్లు సమాచారం. అంతే కాకుండా, ఎంతైనా మన పోలీసులం ఒకటని మా ఇళ్లల్లో సోదాలు ఎందుకు చేస్తున్నారని కూడా అడిగినట్లు తెలుస్తోంది. అయితే, ప్రభాకర్ రావు ఫోన్‌కు స్పందించిన ఉన్నతాధికారి ’మీరు ఏదైనా చెప్పదల్చుకుంటే అధికారిక మెయిల్ కు సమాధానం రాసి పంపించండి.’ అని స్పష్టం చేశారట. దీంతో ప్రభాకర్‌రావు ఏమీ మాట్లాడకుండానే ఫోన్ పెట్టేసినట్లు తెలుస్తోంది. మరో వైపు, ఈ వ్యవహారంలో పోలీసులు దర్యాప్తు ముమ్మరం చేశారు.

Former SIB DSP Praneeth Rao Phone Tapping Case
Former SIB DSP Praneeth Rao Phone Tapping Case

ఈ కేసులో ప్రధాన నిందితుడు ప్రణీత్ రావుతో పాటు నిందితులుగా ఉన్న ఇద్దరు అదనపు ఎస్పీలు భుజంగరావు, తిరుపతన్నల కస్టడీ కోసం మంగళవారం పిటిషన్ వేయనున్నారు. ఈ ముగ్గుర్నీ కలిపి విచారించాలని అధికారులు భావిస్తున్నారు. అటు, చంచల్ గూడ జైలులో రిమాండ్ ఖైదీలుగా ఉన్న నిందితులు పోలీసుల విచారణలో కీలక విషయాలు వెల్లడించినట్లు తెలుస్తోంది. ప్రణీత్ రావుతో కలిసి ఆధారాలు ధ్వంసం చేశామని వారు అంగీకరించినట్లు సమాచారం. విచారణలో వెల్లడైన సమాచారం మేరకు నాగోలు మూసీ వంతెన కింద హార్డ్ డిస్క్ ల భాగాలను పోలీసులు స్వాధీనం చేసుకున్నట్లు తెలుస్తోంది. Former SIB chief Prabhakar Rao ఎస్‌ఐబీ మాజీ చీఫ్ ప్రభాకర్ రావు నేతృత్వంలోనే ఈ వ్యవహారం సాగిందని ప్రణీత్ రావు విచారణలో చెప్పారని.. ఈ మేరకు ప్రభాకర్ రావు, శ్రవణ్ రావు, రాధాకిషన్ లను విచారించేందుకు లుక్ అవుట్ నోటీసులు జారీ చేసినట్లు పోలీసులు వెల్లడించారు. కాగా, తొలుత ఎస్‌ఐబీ ఆధారాల ధ్వంసం కేసులో అరెస్టైన ప్రణీత్ రావును విచారిస్తుండగా Phone tapping ఫోన్ ట్యాపింగ్ వ్యవహారం వెలుగుచూడడంతో పోలీసులు దర్యాప్తు ముమ్మరం చేశారు. రాష్ట్రంలో జరిగిన ఎన్నికలు, ఉప ఎన్నికల సమయంలో ప్రతిపక్ష పార్టీల ముఖ్య నేతలను లక్ష్యంగా చేసుకుని ట్యాపింగ్ లకు పాల్పడినట్లు పోలీసులు గుర్తించారు. వ్యాపారులు, ప్రముఖుల ఫోన్లను సైతం ట్యాపింగ్ చేసినట్లు తెలుస్తోంది. ఎన్నికల ముందు వరకు భుజంగరావు Political Intelligence పొలిటికల్ ఇంటెలిజెన్స్ విభాగంలో, తిరుపతన్న ఎస్‌ఐబీలో అదనపు ఎస్పీలుగా విధులు నిర్వర్తించారు. ఇందులో బిఆర్‌ఎస్ కీలక నేత హస్తం ఉన్నట్లు దర్యాప్తు అధికారులు గుర్తించినట్లు తెలుస్తొంది. ఫోన్ ట్యాపింగ్ వ్యవహారంలో స్పీడ్ పెంచిన పోలీసులు అధనపు ఎస్పీలు భుజంగారావు, తిరుపతన్నలను ప్రశ్నించగా ఐపిఎస్ ప్రభాకర్ రావు పేరు తెరమీదకు వచ్చింది.

ALSO READ: సౌమ్యుడు జ‌డ్జి మ‌ణికంఠ

ఇప్పుడు ముగ్గురు BRS leaders బిఆర్‌ఎస్ కీలక నేతల పేర్లు రిమాండ్ రిపోర్టులో వెల్లడించినట్లు తెలుస్తొంది. అయితే ఆ బిఆర్‌ఎస్ నేతలు ఎవరనేది అధికారులు బయటకి వెల్లడించేలేదు. సదరు బిఆర్‌ఎస్ కీలక నేతకు సెక్షన్ 41 సిఆర్‌పిసి కింద నోటీసులు జారీ చేయనున్నట్లు ప్రచారం జరుగుతోంది. ఫోన్ ట్యాపింగ్ వ్యవహారంలో ట్యాప్ చేయాల్సిన విపక్ష నేతలు, వ్యాపారుల నంబర్లు అందులోని ఒక బిఆర్‌ఎస్ నేత భుజంగరావు, తిరుపతన్నలకు ఇచ్చేవారని, వారు ఈ నెంబర్లను ప్రణీత్ రావుకు చేరవేయగా ప్రభాకర్ రావు ఆదేశాల మేరకు సదరు బిఆర్‌ఎస్ కీలక నేతకు డాటా ట్రాన్స్ ఫర్ చేసేవారని అధికారుల విచారణలో తేలినట్లు తెలుస్తొంది. ఇప్పటివరకు ఫోన్ ట్యాపింగ్ కేసులోని పాత్రదారుల పేర్లు బయటపెట్టిన అధికారులు త్వరలోనే అసలు సూత్రదారుల పేర్లు కూడా బయటకు తీసే అవకాశం ఉంది.

Tapping device from Israel

మరోవైపు ప్రణీత్‌రావు ఫోన్ ట్యాపింగ్ ఎపిసోడ్‌లో Ravi paul రవిపాల్ కీలకంగా మారారు. SIB Technical Consultant ఎస్‌ఐబి టెక్నికల్ కన్సల్టెంట్‌గా ఉన్న రవిపాల్ నేతృత్వంలోనే ట్యాపింగ్ డివైజ్‌లు కొనుగోలు చేసినట్లు పోలీసులు గుర్తించారు. కేంద్ర ప్రభుత్వం అనుమతి లేకుండా డివైజ్‌ను తీసుకొచ్చిన రవిపాల్, ఓ సాఫ్ట్‌వేర్ కంపెనీ పేరుతో Tapping device from Israel ఇజ్రాయిల్ నుంచి ట్యాపింగ్ డివైజ్‌లు దిగుమతి చేసినట్లు సమాచారం. ఇందుకు రవిపాల్‌కు ఎస్‌ఐబి కోట్లలో డబ్బులు చెల్లిం చినట్లు తెలిసింది. రవిపాల్, ప్రభాకర్ కలిసి అధునాతన డివైజ్‌లను దిగుమతి చేసుకున్నట్లు పోలీసుల విచారణలో తేలింది. 300 మీటర్ల పరిధిలో మాటలను వినే వీలున్న డివైజ్‌లను తెచ్చిన రవిపాల్, రేవంత్‌రెడ్డి ఇంటి సమీపంలో ఆఫీసు తీసుకుని డివైజ్ ఏర్పాటు చేసినట్లు గుర్తించారు. రేవంత్ ఇంట్లో జరిగే ప్రతి విషయాన్ని ఎప్పటికప్పుడు ప్రణీత్‌రావు, రవిపాల్ విన్నారు. ఈ క్రమంలో రవిపాల్‌ను ప్రశ్నించేందుకు పోలీసులు రంగం సిద్ధం చేశారు.

ప్ర‌దాన వార్త‌లు

కేటీఆర్‌కు రాజకీయ ఓనమాలు తెలియవు.. అన్న కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి వ్యాఖ్య లను మీరు సమర్థిస్తారా..?
- Advertisment -

Most Popular

WP Tumblr Auto Publish Powered By : XYZScripts.com