Saturday, April 19, 2025

హైదరాబాద్ లో పట్టపగలు బైక్‌పై ప్రేమ జంట రొమాన్స్‌

హైదరాబాద్ లో ప్రేమ జంటలు రెచ్చిపోతున్నాయి. పార్క్ లు, క్లబ్బులు, హోటళ్లు.. ఎక్కడ చూసినా ప్రేమ జంటలే. ఇప్పుడు అవన్నీ అయిపోయాయని ఏకంగా రోడ్డే ఎక్కేశాయి కొన్ని ప్రేమ జంటలు. హైదరాబాద్ శివారు శ్రీశైలం రహదారిపై ప్రేమజంటలు రెచ్చిపోతున్నాయి.  బుధవారం ఓ ప్రేమ జంట పట్ట పగలు రోడ్డుపై రొమాన్స్ చేస్తూ రెచ్చిపోయింది. ఓ యువతి బైక్ పెట్రోల్‌ టాంక్‌పై కూర్చొని వాహనం నడుపుతున్న యువకుడికి ముద్దులు పెడుతూ రొమాన్స్‌ చేసింది. రోడ్డుపై వెళఅతున్నవారంతా వారి రొమాన్స్ చూసి ముక్కున వేలేసుకున్నారు. ఈ జుకుప్సాకరమైన సంఘటన నగర శివారులోని పహాడీషరీఫ్‌ దగ్గర చోటుచేసుకుంది. వీరు బైక్ పై చేస్తున్న రొమాన్స్ దృశ్యాలను మరో జంట మొబైల్ ఫోన్ లో వీడియో తీసి సోషల్ మీడియాలో పోస్ట్ చేయడంతో వైరల్‌ అవుతోంది. దీనిని చూసిన ఓ ప్రయాణికుడు ట్విటర్‌లో పోలీసులకు ఫిర్యాదు చేశాడు. పోలీసులు బైక్ నంబర్ ఆధారంగా వీరిని గుర్తించే పనిలో పడ్డారు.

ప్ర‌దాన వార్త‌లు

కేటీఆర్‌కు రాజకీయ ఓనమాలు తెలియవు.. అన్న కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి వ్యాఖ్య లను మీరు సమర్థిస్తారా..?
- Advertisment -

Most Popular

WP Tumblr Auto Publish Powered By : XYZScripts.com