ఫోన్ మాట్లాడుతూ నీటిలో పెట్టాల్సిన హీటర్ చంకలో పెట్టుకోవడంతో షాక్ కొట్టి ఓ వ్యక్తి మృతి చెందాడు. ఈ ఘటన ఖమ్మం జిల్లాలో చోటు చేసుకుంది. స్థానిక కాల్వ ఒడ్డునున్న హనుమాన్ గుడి సమీపంలో దోనెపూడి మహేశ్ బాబు (40) ఆదివారం రాత్రి ఆయన ఇంట్లో పెంపుడు కుక్కకు స్నానం చేయించేందుకు వేడినీళ్ల కోసం హీటర్ ఆన్ చేయబోయాడు. ఈ లోగా ఫోన్ రావడంతో మాట్లాడుతూ.. హీటర్‌ను నీటిలో బదులు చంకలో పెట్టుకుని స్విచ్ ఆన్ చేశారు. దీంతో షాక్ కొట్టి కింద పడిపోయాడు. దగ్గర్లో ఉన్న ఆయన తొమ్మిదేళ్ల కుమార్తె శభన్య భయంతో కేకలు వేస్తూ పరుగెత్తింది. దీంతో అప్రమత్తమైన భార్య దుర్గాదేవి మహేశ్ బాబును ఆసుపత్రికి తరలించారు. కానీ అప్పటికే ఆయన మృతి చెందినట్లు వైద్యులు తెలిపారు. మహేశ్‌బాబు దంపతులకు ఇద్దరు కుమార్తెలున్నారు.