కృష్ణాజిల్లా: పెనమలూరు నియోజకవర్గం యనమలకుదురులో ఒకరిపై కత్తితో దాడి.యనమలకుదురు రామలింగేశ్వర నగర్ కు చెందిన మిర్యాల అర్జునరావు(61) గణేష్ చతుర్దని పురస్కరించుకొని మామిడి ఆకులు కోయడానికి బంధువుల ఇంటికి వెళ్ళాడు.ఆ ఇంట్లో అద్దెకుకుంటున్న గెడ్డం నాంచారయ్య (36) తమ అనుమతి లేకుండా మా ఇంటిలోని మామిడి ఆకులు ఎలా కోస్తారని అతనితో వాగ్వాదం చేశాడు.మాట మాట పెరగడంతో వంటగదిలోని కత్తి తీసుకువచ్చి మిర్యాల అర్జునరావు పై దాడి చేశాడు.తీవ్ర రక్తస్రావం అవడంతో పడమట లోని విజయ ఆసుపత్రికి తరలింపు.కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్న పెనమలూరు పోలీసులు.